twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు సైఫ్.. ఆదిపురుష్‌లో రావణబ్రహ్మకు భారీ ఆఫర్.. చోటా నవాబ్ ఆస్థి విలువ ఎంతంటే!

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ కాంబినేషన్‌లో వస్తున్న ఆదిపురుష్ చిత్రం ద్వారా చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్ దక్షిణాదికి ప్రధానంగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ ఓ విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదిపురుష్‌లో రాక్షసవతారం కనిపించబోతున్నారనే వార్త మీడియాలో హైలెట్‌గా మారింది. సైఫ్ ఖాన్ పాత్ర గురించి ఆదిపురుష్ యూనిట్ వెల్లడించిన నేపథ్యంలో ఆయన సినీ, వ్యక్తిగత, రాజవంశానికి చెందిన వివరాలు మీ కోసం..

    పటౌడీ రాజవంశంలో చోటా నవాబ్‌గా

    పటౌడీ రాజవంశంలో చోటా నవాబ్‌గా

    నటి షర్మిలా టాగోర్, మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి కుమారుడైన సైఫ్ ఆలీ ఖాన్ పటౌడీ రాజ వంశంలో జన్మించారు. హీరోయిన్ అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకొన్నారు. వారికి సారా ఆలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం కలిగింది. అయితే వ్యక్తిగత జీవితంలో అభిప్రాయ బేధాల కారణంగా అమృతా, సైఫ్ ఆలీ ఖాన్ విడిపోయారు.

    సైఫ్ ఆలీ ఖాన్ దాంపత్య జీవితం, కరీనాతో

    సైఫ్ ఆలీ ఖాన్ దాంపత్య జీవితం, కరీనాతో

    అమృతా సింగ్‌తో విడిపోయిన తర్వాత కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకొన్నారు. వారికి తైమూర్ అనే కుమారుడు ఉన్నారు. సైఫ్ తన జీవితంలో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. కరీనా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇటీవల సైఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. దాంతో నాలుగోసారి తండ్రి కాబోతున్న సైఫ్‌కు అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

    సైఫ్ ఆలీ ఖాన్ కెరీర్

    సైఫ్ ఆలీ ఖాన్ కెరీర్

    1993లో యష్ చోప్రా దర్శకత్వం వహించిన పరంపర చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అనంతరం యే దిల్లగీ, మై ఖిలాడీ తు అనాడీ, హమ్ సాత్ సాత్ హై, బీవీ నంబర్ 1, దిల్ చాహ్తహై, రెహనా హై తేరె దిల్ మే, ఎల్వోసీ కార్గిల్, రేస్, ఓంకారా లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించారు. తాజాగా తన ఇమేజ్‌కు భిన్నంగా ఆదిపురుష్ చిత్రంలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతుండటం విశేషం.

    Recommended Video

    Prabhas Vs Saif Ali Khan In Adipurush | సీత పాత్ర లో ఆమె బాగుంటుంది అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
    చోటా నవాబ్ సంపాదన ఇలా..

    చోటా నవాబ్ సంపాదన ఇలా..

    సినిమాలతో పాటు వ్యాపార ప్రకటనల్లో కూడా భారీగానే నటిస్తున్నారు. లేయ్స్, ఎయిర్ బీఎన్‌బీ, అముల్ మాచో, ఎయిర్ టెల్, లిమ్కా, సంతూర్, ఏషియన్ పెయింట్స్ రాయల్ లాంటి వ్యాపార ప్రకటనల్లో నటించారు. ఇలా సినీ, వ్యాపార ప్రకటనల్లో భారీగా ఆదాయం సైఫ్ ఆర్జిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం 2019లో సైఫ్ ఆదాయం 17 కోట్లకుపైనే అని లెక్క తేల్చారు. ఇక ఆదిపురుష్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు సమాచారం.

    పటౌడీ కుటుంబ ఆస్తుల విలువ

    పటౌడీ కుటుంబ ఆస్తుల విలువ

    ఇదిలా ఉండగా, ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సైఫ్ ఆలీ ఖాన్ నికర ఆస్తుల విలువ సుమారు 300 కోట్లుగా తేల్చారు. వారి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌ విలువ రూ.800 కోట్లుగా అంచనా వేశారు. దీంతో సైఫ్ ఆలీ ఖాన్ దేశంలోని నటుల్లో సంపన్నుడిగా చోటు సంపాదించుకొన్నారు.

    English summary
    Saif Ali Khan is making his entry into tollywood. He is going to be silver screen Lankesh for Prabhas's Adhipurush. In this occassion, his remuneration and his net worth of assets become talk of the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X