దేవర నుంచి ‘భైర’ గ్లింప్స్ .. భయపెట్టిన సైఫ్ అలీఖాన్, అంచనాలు పెంచేశాడుగా

తనకు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా రేంజ్ సాధించిన ఎన్టీఆర్ నటిస్తుండటంతో దేవరపై ఇండస్ట్రీ ఫోకస్ చేసింది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు తొలి‌సారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సింగిల్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు సంబంధించిన వర్క్‌ను ఆయన రీసెంట్‌గా పూర్తి చేసుకున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారు.

దేవర బిజినెస్‌ కూడా ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ నార్త్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్నారు. కన్నడ థియేట్రికల్ రైట్స్‌ను ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ, కన్నడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి కొనుగోలు చేశారు. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే , యూరప్‌లలో దేవర డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఓ బడా సంస్థకు రూ.27 కోట్ల డీల్‌తో దేవర నిర్మాతలు క్లోజ్ చేసినట్లుగా ఫలింనగర్ టాక్.

saif ali khan s bhaira glimpse form ntr - korata siva s devara movie out now

ఇప్పటికే ఆదిపురుష్‌లో రావణాసురుడి పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపిన సైఫ్‌ అలీఖాన్.. దేవరలో ఎలా చేశారు, ఆయనను కొరటాల శివ ఎలా చూపించాడనేది ఉత్కంఠగా మారింది. కొరటాల గత చిత్రాల్లో హీరోతో సమానంగా ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉంటుంది. ఆయన చిత్రాలు హిట్ కావడంలో విలన్ పాత్రలూ కీలకపాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ రోల్ పైనా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జయిట్‌మెంట్‌కు తెరదించుతూ నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవరలో సైఫ్ క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

దేవరలో సైఫ్ అలీ ఖాన్ .. భైర అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. అది ఎలా ఉందో ఒకసారి చూస్తే.. ఓ మల్లయోధుడిగా ఆయన కనిపిస్తున్నారు. గ్లింప్స్ ప్రారంభమవ్వగానే రాత్రిపూట ఓ కొండ ప్రాంతంలో కత్తులను ఊరేగిస్తూ తీసుకొస్తారు. భారీ జనసందోహం మధ్యలో బరి గీసి.. కుస్తీ పోటీ నిర్వహించగా.. జనం భైరా , భైరా అని కేకలు వేస్తుంటారు. ఇంతలో భైర గెటప్‌లో ఉన్న సైఫ్ అలీఖాన్ తనతో పోటీకి దిగిన మరో వ్యక్తిని మట్టికరిపిస్తుంటాడు. చూస్తుంటే అక్కడ ఉన్నోళ్లంతా ఆ భైర సైన్యమేనని అర్ధమవుతోంది. చివరిలో ఓ అటవీ ప్రాంతంలో భైర ఎవరినో వెంటాడుతుండగా గ్లింప్స్ ముగుస్తోంది.

దీంతో దేవరలో భైర క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొరటాల శివ హింట్ ఇచ్చాడు. సైఫ్ రోల్ చాలా క్రూరంగా ఉండబోతోందని.. తారక్‌కు ధీటైన విలన్‌గా ఆయన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అదిరిపోయాయని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. మొత్తంగా భైర .. దేవరపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X