Happy Birthday Salman Khan:సల్మాన్‌ను కాటేసిన పాము.. బర్త్ డేకి ముందు ఆరు గంటలపాటు హస్పిటల్‌లో.. ఏం జరిగిందంటే

దేశ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన 56వ జన్మదినాన్ని డిసెంబర్ 27న ఘనంగా జరుపుకొంటున్నారు. సల్మాన్ బర్త్ డే‌ను పురస్కరించుకొని అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో పోటెత్తుతున్నారు. అయితే తన బర్త్ డేకు ముందు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారనే వార్త ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేసింది. పాము కాటుకు గురైన సల్మాన్ గురించిన విషయాన్ని తన సన్నిహితుడు సోషల్ మీడియాలో వెల్లడించడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. సల్మాన్ ఖాన్ పాము కాటుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

పన్వేల్ ఫామ్‌హౌజ్‌లో..

పన్వేల్ ఫామ్‌హౌజ్‌లో..

సల్మాన్ ఖాన్ తన బర్త్ డేకు ముందు ముంబైకి సమీపంలోని పన్వేల్‌లోని ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. అయితే తన ఇంటిలోకి పాము రావడంతో దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కర్ర సహాయంతో దానిని బయటకు పంపించే క్రమంలో పాము చేతిపైకి పారింది. చేతిపైకి ఎక్కిన పామును వదిలించడానికి ప్రయతించడంతో ఆందోళనతో మూడు సార్లు కాటు వేసింది అని సన్నిహితుడు బీనా నాయక్ తెలిపారు.

పాము కాటుతో హాస్పిటల్‌లో చేరిక

పాము కాటుతో హాస్పిటల్‌లో చేరిక

సల్మాన్ ఖాన్‌ను పాము కాటు వేయడంతో అక్కడి సిబ్బంది కంగారు, ఆందోళనకు గురయ్యారు. ఆ పాము విషంతో కూడినది కావడంతో వెంటనే హస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్సను అందించారు. దాంతో సల్మాన్‌కు పెద్ద ముప్పే కాకుండా ప్రాణహాని నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సన్నిహితులు తెలిపారు.

డిసెంబర్ 27న జన్మదినం

డిసెంబర్ 27న జన్మదినం

సల్మాన్ ఖాన్‌ ఆరోగ్యం గురించి ఆయన స్నేహితుడు, నటుడు, రాజకీయ నేత బినా నాయక్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. అతని కుటుంబ సభ్యులందరూ ఆయనతోనే ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అభిమానులు, సన్నిహితులు, స్నేహితుల దీవెనల కారణంగానే సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని సల్మాన్‌ ఖాన్‌తో సెల్ఫీ ఫోటో‌తో బీనా నాయక్ పోస్టు చేశారు.

6 గంటలపాటు హాస్పిటల్‌‌లో

6 గంటలపాటు హాస్పిటల్‌‌లో

జాతీయ వార్తా ఏజెన్సీతో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. నా ఫామ్ హౌజ్‌లోకి పాము చొరబడింది. దానిని వెళ్లగొట్టడానికి నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో మూడుసార్లు కాటు వేసింది. దాదాపు 6 గంటలపాటు హాస్పిటల్‌‌లో ఉన్నాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది అని తన హెల్త్ గురించి అభిమానులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని సల్మాన్ ఖాన్ చేశారు.

57వ పడిలోకి సల్మాన్ ఖాన్

57వ పడిలోకి సల్మాన్ ఖాన్

ఇక సల్మాన్ ఖాన్ తన 56 ఏళ్లు పూర్తి చేసుకొని 57వ పడిలోకి ప్రవేశించారు. తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. అభిమానులు తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ షోలో పాల్గొన్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్, ఆలియాభట్ మూడు రోజుల ముందుగానే సల్మాన్ ఖాన్ బర్త్ డేను జరిపించిన విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ సినీ కెరీర్ ఇలా..

సల్మాన్ ఖాన్ సినీ కెరీర్ ఇలా..

ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అంతిమ్: ది ఫైనల్ ట్రూత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షోతో బిజీగా ఉన్నారు. అలాగే టైగర్ 3 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలాగే భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రానికి సీక్వెల్‌ను తన బర్త్ డే సందర్భంగా ప్రకటించారు.

వీజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సినిమాకు పవన్ పుత్ర భాయ్‌జాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నో ఎంట్రీ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసి మీట్ అండ్ గ్రీట్ మీడియా సందర్బంగా సల్మాన్ ఖాన్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X