twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ బేషరతు క్షమాపణ.. ఆ సెంటిమెంట్‌ను వదులుకోను అంటూ కామెంట్

    |

    దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే...

    కరోనావైరస్ సెకండ్ వేవ్ దెబ్బ

    కరోనావైరస్ సెకండ్ వేవ్ దెబ్బ


    సినీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉన్న సమయంలో థియేటర్లలో రిలీజ్‌కు సల్మాన్ ఖాన్ నటించిన రాధే మూవీ సిద్ధమైంది. అయితే అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ భారీ దెబ్బ తీసింది. దాంతో సల్మాన్‌ ఖాన్ తన సినిమాను ఈద్ కానుకగా ఓటీటీ రిలీజ్‌తోపాటు థియేటర్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

    జీ ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్

    జీ ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్

    అయితే ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ చేసే పరిస్థితులు అనుకూలంగా లేవు. దాంతో థియేటర్లను మినహాయించి జీ పే పర్ వ్యూ పద్దతిన సినిమాను రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ డిసైడ్ అయ్యారు. అయితే రాధే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని థియేటర్ ఓనర్లు విన్నవించుకొన్నారు. అయితే అందుకు సల్మాన్ ఖాన్ నిరాకరించారు.

    ప్రతి రంజాన్‌కు నా సినిమా ప్రేక్షకుల ముందుకు

    ప్రతి రంజాన్‌కు నా సినిమా ప్రేక్షకుల ముందుకు


    రాధే సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ప్రతీ రంజాన్ పండుగకు నా సినిమాను రిలీజ్ చేయాలనే సెంటిమెంట్‌ను నేను కాదనుకోలేని పరిస్థితి. జీ సంస్థ, నా ఫ్యాన్స్ సహకారంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నా సినిమా రిలీజ్ చాలా ముఖ్యం అంటూ సల్మాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    తక్కువ ధరకే ఇంట్లోనే రాధే సినిమా

    తక్కువ ధరకే ఇంట్లోనే రాధే సినిమా

    దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో సినిమాల వద్ద టికెట్ల రూపంలో సినిమాను నడిపించడం చాలా కష్టం. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలు తక్కువ రేటుకు రాధే మూవీని ఇంట్లోనే చూసే విధంగా అవకాశం ఏర్పడింది. ఇలాంటి విషాద పరిస్థితుల్లో ప్రజలకు కాస్త వినోదం అందించాలనేదే నా ప్రయత్నం అని సల్మాన్ ఖాన్ అన్నారు.

    Recommended Video

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    కరోనావైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత

    కరోనావైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత

    ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెప్పుకొంటున్నాను. నా సినిమా ద్వారా లాభాలు ఆర్జించాలనే ఆశతో ఉన్న సినిమా థియేటర్ యాజమాన్యాలకు నా క్షమాపణలు. మేము ఈ సినిమా రిలీజ్‌ను చాలా వరకు వాయిదే వేసి వేచి చూశాం. కరోనా తీవ్రత తగ్గేలా లేదు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తాం అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.

    English summary
    Salman Khan apologised to the theatre owners over Radhe movie OTT Release. Salman said, Things are very panic Nationalwide. So I am going to release my movie as per my sentiment. For that, He said, I apologise to cinema owners.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X