twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా తండ్రి ఆ పేరు పెట్టాడు.. ఇంటిపేరు చెప్పి దేశాన్ని కించపరుచను.. సల్మాన్

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భారత్. రిపబ్లిక్ డే‌ను పురస్కరించుకొని ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ విభజన నేపథ్యంగా కొన్ని సన్నివేశాలు టీజర్‌లో కనిపించాయి. ఇంకా చాలా ఆసక్తికరమైన సీన్లు సల్మాన్ ఖాన్ పాత్రపై కన్‌ఫ్యూజన్ కలిగించాయి. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌లో ఏమున్నదంటే..

     పలు రకాల పాత్రల్లో సల్మాన్

    పలు రకాల పాత్రల్లో సల్మాన్

    భారత్ సినిమా టీజర్ చూస్తే సల్మాన్ ఖాన్ పలు రకాల పాత్రల్లో దర్శనమిచ్చారు. నావీ ఆఫీసర్‌గా, మైనింగ్ కార్మికుడిగా, సర్కస్ కంపెనీలో పనిచేసే వ్యక్తిగా ఇలా చాలా రకాల పాత్రల్లో కనిపించాడు. అయితే ఇంతకీ సల్మాన్ ఖాన్ పాత్ర ఏంటో రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించారు.

    దేశభక్తి, యాక్షన్ మసాలా

    దేశభక్తి, యాక్షన్ మసాలా

    భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్స్ దేశభక్తి ప్రధానంగా సాగాయి. నా తండ్రి నా పేరు భారత్ అని పెట్టారు. నా ఇంటి పేరు ఏమిటని అడుగుతున్న వారికి ఒకటే జవాబు చెప్పాలనుకొన్నాను. నా ఇంటి పేరును నా పేరు ముందు తగిలించుకొని దేశాన్ని, నా ఆత్మగౌరవాన్ని కించపరుచుకోలేను అని సల్మాన్ చెప్పడం హైలెట్.

     బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా

    బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‌గా

    సల్మాన్ నటించిన భారత్ చిత్రం యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు స్పష్టమవుతున్నది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. అయితే టీజర్‌లో కత్రినా, సల్మాన్ కెమిస్ట్రీ, మ్యాజిక్ కనిపించలేదు. అభిమానులకు టీజర్‌లో కొంత అసంతృప్తిని కలిగించే విషయంగా కనిపించింది.

    రంజాన్ పండుగకు రిలీజ్

    భారత్ చిత్రాన్ని ఈ ఏడాది రంజాన్ పండుగకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో టబూ, జాకీ ష్రాఫ్, దిషా పటానీ, నోరా ఫతే, సునీల్ గ్రోవర్ నటించారు. అయితే ఈ సినిమాలో సల్మాన్ మళ్లీ గూడచారిగా కనిపిస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

    English summary
    Salman Khan's Bharat movie teaser released. Salman can be seen in various roles, including a navy officer, thug, miner and an entertainer in the circus. Salman, Ali and Katrina Kaif’s magic could not be seen in the first teaser. Tabu, Jackie Shroff, Disha Patani, Nora Fatehi and Sunil Grover’s glimpses were missing from the trailer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X