Salman Khan Birthday: సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ భాయ్ జాన్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్... బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇక డిసెంబర్ 27న ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సల్మాన్ ఖాన్ కు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తుల విలువ ఎంతో ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ సీనియర్ హీరో కండలవీరుడు నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దాదాపు 3 దశాబ్దాల నుంచి బీటౌన్ లో సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న ఈ హీరో.. తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇక ఈరోజు సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తి విషయాలు బయటకు వస్తున్నాయి.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరనే విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఆస్తులు కూడా వేల కోట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన భాయిజాన్ సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ లో ఉంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా అలరిస్తున్నారు సల్మాన్ ఖాన్.
ఈ కండల వీరుడి ఆస్తి విలువ సుమారు 3000 కోట్లుగా ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. సల్మాన్ ఖాన్ నెల వారీ సంపాదన 16 కోట్లకు పైగానే ఉంటుందని... తెలుస్తోంది. ఇక ఆయన తమ్ముడు అర్బాజ్ ఖాన్ కూడా బాగానే సంపాదించాడని తెలుస్తోంది. అర్భాజ్ ఖాన్ ఒక చిత్రానికి 10 నుండి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం. అర్బాజ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 82 మిలియన్లని.. తెలుస్తోంది.
ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక టైగర్ సినిమాకు సల్మాన్ 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే సల్మాన్ తన మొదటి రెమ్యూనరేషన్.. 11వేల రూపాయలు అట. ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆయన రేంజ్ ఏంటో తెలుస్తోంది.
ఇక బుల్లితెరపై బిగ్ బాస్ హిందీ హోస్టుగా సల్మాన్ ఖాన్ వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ సీజన్ 17కి సల్మాన్ భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. అలా సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ మూడు వేల కోట్లకు పైగానే ఉంటాయని తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని తెలుగు ఫిల్మీ బీట్ టీమ్ కోరుకుంటుంది.


Click it and Unblock the Notifications











