అల్లు అర్జున్ రిజెక్ట్ చేస్తే.. కండల వీరుడుకి కలిసొచ్చింది.. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటీ?

సాధారణంగా కొందరికి నచ్చనిది.. మరికొందరికి నచ్చుతాయి. ఆ విషయాలే ఒక్కోసారి వారి అదృష్టాన్ని మార్చి వేయవచ్చు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే.. ఒక సినిమా కథ ఒకరికి నచ్చకపోవచ్చు. అదే కథ మరొకరి కెరీర్ ను మలుపు తిప్పవచ్చు. అలా చాలామంది హీరోలు వదులుకున్న సినిమాలు మరొకరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి. ఊహించని విజయాన్ని అందిస్తాయి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అమీర్ ఖాన్ వదులుకున్న మూవీ .. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న హీరో ఎవరు?

ఆ హీరో ఎవరో కాదు .. బాలీవుడ్ కండల వీరుడు, హీరో సల్మాన్ ఖాన్.ఆయన తన కెరీర్లు ఎన్నో విజయాలు అందుకొని బాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. సల్లు బాయ్ కెరీర్లో సుల్తాన్, టైగర్ జిందా హై, ప్రేమ్ రతన్ దన్ పాయో .. ఇలాంటి ఎన్నో చిత్రాలు 100 కోట్ల మార్కును క్రాస్ చేశాయి. అలాంటి స్థాయిలోనే భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన మరో సినిమా 'బజరంగీ భాయిజాన్' . ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్లో ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు.

Salman Khan Blockbuster Bajrangi Bhaijaan Was Rejected by Allu Arjun and Aamir Khan

వాస్తవానికి బజరంగీ భాయిజాన్ సినిమాలో తొలుత హీరోగా అల్లు అర్జున్ ను తీసుకోవాలని భావించారట. అయితే.. ఆ సమయంలో బన్నీ చేతిలో వేరే ప్రాజెక్ట్ ఉండడం, అలాగే అప్ కమింగ్ ప్రాజెక్టులు కూడా సైన్ చేసి ఉండడంతో ఈ సినిమాకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడట దీంతో ఆ ఆఫర్ అమీర్ ఖాన్ కు పోయింది. కానీ అమీర్ ఖాన్ స్టోరీలో కొన్ని మార్పులు చేయాలని సూచించారట. కానీ డైరెక్టర్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా కథ చివరికి సల్మాన్ ఖాన్ వద్దకు చేరుకుంది.

బజరంగీ భాయిజాన్ కథను సల్మాన్ ఖాన్ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడంట. ఇక ఈ సినిమా 2015లో నేషనల్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ పవన్ అనే హనుమాన్ భక్తుడి పాత్రలో నటించారు. అతడికి హర్యానాలో తప్పిపోయిన మూగ చెవిటి బాలిక కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇవ్వరా అని ఆరాధిస్తే పాకిస్తాన్ కు చెందిన బాలిక అని తెలుస్తుంది. ఆ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని పవన్ చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది. ఈ క్రమంలో పవన్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి శత్రుదేశాల ప్రజల మండనలు ఎలా అందుకుంటాడు అనేది ఈ సినిమా కథ.

'బజరంగీ భాయిజాన్ ' సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కేవలం రూ. 75 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన బజరంగీ భాయిజాన్ సినిమా ..అప్పటివరకు బాక్సాఫీస్ పలు రికార్డులను బ్రేక్ చేసింది. రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 320 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 922 కోట్లు వసూలు చేసి సినిమాటిక్ మాస్టర్ పీస్ గా నిలిచింది బజరంగీ భాయిజాన్. అలాగే ఐఎండీబీ కూడా 8.1 రేటింగ్ ఇచ్చింది. ఇలా అల్లు అర్జున్ సల్మాన్ ఖాన్ వద్దనుకున్న సినిమా సల్మాన్ ఖాన్ కు కలిసి వచ్చిందంటూ మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

Salman Khan Blockbuster Bajrangi Bhaijaan Was Rejected by Allu Arjun and Aamir Khan

ఇక సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ సినిమాల విషయానికొస్తే.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే .. గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అలాగే అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించేందుకు మూవీ మేకర్స్ తీవ్రంగా కష్టపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X