ప్రాణ స్నేహితుడి మృతదేహాన్ని చూసి సల్మాన్ కంటతడి.. ఆ షూటింగ్ మధ్యలోనే వదిలేసి..!
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యినటువంటి గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ అని చెప్పడంలో సందేహం లేదు. కాగా వెస్ట్రన్ కంట్రీస్ లో స్టార్ట్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యిన ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు మన దేశంలో కూడా పలు భాషల్లో లీడింగ్ రేటింగ్ తో దూసుకెళ్తుంది.
అయితే మన సౌత్ భాషల్లో కొన్నేళ్ల కితం స్టార్ట్ అయినప్పటికీ అంతకు ముందు నుంచే హిందీ మార్కెట్ లో బిగ్ బాస్ ఆల్రెడీ పాగా వేసింది. ఇలా హిందీలో మొదటి నుంచి పాపులర్ గా మారిన ఈ గ్రాండ్ షోకి బాలీవుడ్ మెగాస్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా మారిన తర్వాత నుంచి ఈ షోకి మరింత కిక్ వచ్చి హిట్ అయ్యింది. సల్మాన్ ఖాన్ హిందీలో బిగ్ బాస్ సీజన్ 4 నుంచి హోస్టింగ్ స్టార్ట్ చేసాడు.

అలాగే ఆ నాల్గవ సీజన్ నుంచి ఇప్పుడు వరకు మొత్తం 18వ సీజన్ వరకు తానే తీసుకొచ్చి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా తీసుకెళ్తున్నాడు. కాగా జస్ట్ కొన్ని రోజులు కితమే హిందీలో 18వ సీజన్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీనటులు హౌస్ లోకి వెళ్లారు. అంతే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు కూడా హిందీ బిగ్ బాస్ లోకి వెళ్ళింది అని వార్తలు కూడా వచ్చాయి.
మరి ఇలా ఒక ఫ్లో లో షూటింగ్ కి వెళ్ళిపోతున్న ఈ సీజన్ మధ్యలో ఒక ఊహించని షాక్ తగిలింది. సల్మాన్ ఖాన్ పై లేటెస్ట్ గా ఓ ఎపిసోడ్ ని షూట్ చేస్తుండగా షూటింగ్ మధ్యలోనే ఆపేసి హుటాహుటిన సల్మాన్ వెళ్ళిపోయిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఇందుకు సల్మాన్ దగ్గర విషాద కారణమే ఉందట.
తనకి ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అయినటువంటి బాబా సిద్ధిఖిని ముంబై, బాంద్రాలో ఎవరో కాల్చి చంపేశారని షాకింగ్ వార్త విని సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడట. దీనితో ఈ వార్తలు బాలీవుడ్ లో షాకింగ్ గా మారాయి. బాబా సిద్దికీ సల్మాన్ కి ఎంతో దగ్గర స్నేహతుడు కాగా తన స్నేహితుడి కోసం ఇలాంటి ఊహించని వార్త వినేసరికి తాను వెంటనే వెళ్ళిపోయాడట.

కాగా బాబా సిద్ధిఖికి బాలీవుడ్ లో మరింతమంది స్టార్స్ తో మంచి సాన్నిహిత్యం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి తన ఫ్రెండ్ లేడు అంటే ఎవరికి అయినా హృదయం ముక్కలైపోతుంది. సో సల్మాన్ షూట్ లో ఉన్నప్పటికీ ఆపేసి తన స్నేహితుడు కోసం వెళ్ళిపోయాడు. లీలావతి హాస్పిల్‌లో తన స్నేహితుడు బాబా సిద్దిఖీ మృతదేహాన్ని చూసి సల్మాన్ భోరున ఏడుస్తూ కంటతడి పెట్టాడని సన్నిహితులు తెలిపారు.
ఇక్కడ మరో షాకింగ్ అంశం ఏమిటంటే గత కొన్నాళ్ల కితం ఇదే బాంద్రాలో సల్మాన్ ఇంటి దగ్గర కూడా ఎవరో గన్స్ తో కాల్పులు జరిపిన వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎప్పుడు నుంచో సల్మాన్ విషయంలో ప్రాణహాని వార్తలు తరచూ వినిపిస్తూ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ సల్మాన్ సినిమాలు షూటింగ్స్ తో ఈ థ్రెట్ నడుమే జీవనం సాగిస్తున్నాడు. ఇపుడు తన ఫ్రెండ్ కి ఇలా అయ్యింది. మరి ఇక నుంచి అయినా సల్మాన్ మరింత జాగ్రత్తగా ఉంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











