twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్ళ దెబ్బకు దిగొచ్చిన సల్మాన్ ఖాన్.. సినిమా టైటిల్ మారిపోయింది!

    |

    సల్మాన్ ఖాన్ ప్రస్తుతం లవ్ రాత్రి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ భర్త ఆయుష్ శర్మ ఈ చిత్రంలో హీరో. ఆయుష్ శర్మ, వారిన హుస్సేన్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందువులు పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. అభిరాజ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    Salman Khan changes Love Ratri title after controversy

    నవరాత్రి ఉత్సవాలని అవమానించేలా, హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఈ చిత్ర టైటిల్ ఉందని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ చిత్ర టైటిల్ ప్రకటించగానే హిందూ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సినిమా టైటిల్ మార్చకుంటే విడుదల అడ్డుకుంటామని హెచ్చరించారు.

    దీనితో ఈ చిత్ర టైటిల్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ లవ్ రాత్రి టైటిల్ ని లవ్ యాత్రిగా మార్చినట్లు సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా కొత్త టైటిల్ ఉన్న పోస్టర్ షేర్ చేశాడు. ఇటీవల బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అమిర్ ఖాన్ పీకే చిత్రం, దీపిక పదుకొనె పద్మావత్ చిత్రం వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Loveratri is now Loveyatri. Salman Khan changes title after controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X