నేనేం ఒంటరివాడిని కాదు.. ఆ పోస్ట్ పై సల్మాన్ ఖాన్ క్లారిటీ

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో చేసిన ఒక చిన్న పోస్ట్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 'అలోన్' (Alone), 'లోన్లీ'(Lonely) మధ్య తేడాను వివరించిన ఆయన సందేశం క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్ అభిమానుల్లో ఆందోళన రేపింది. అయితే ఆ పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తాజాగా స్వయంగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షర్ట్‌లెస్ ఫోటోతో పాటు ఒక మెసేజ్ షేర్ చేశారు. "ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి... ఒకటి 'అలోన్', రెండోది 'లోన్లీ'" అంటూ ఆయన రాసిన ఈ వాక్యాలు నెటిజన్లను ఆలోచింపజేశాయి. చాలా మందిలో అనుమానాలు రేకెత్తించాయి. ముఖ్యంగా "ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్" అనే లైన్ అభిమానులను కంగారుపెట్టింది. దీంతో సల్మాన్ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉందా? ఆయన నిజంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

Salman Khan Clarifies Viral Alone vs Lonely Post Says He Is Happy and Not Lonely

ఈ నేపథ్యంలో ఈ వైరల్ న్యూస్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్ స్పష్టత ఇచ్చారు. 'నేను నా గురించి ఆ పోస్ట్ పెట్టలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. చాలా మంది స్నేహితులు ఉన్నారు. అభిమానుల ప్రేమ ఎప్పుడూ నాకు తోడుగా ఉంటుంది. నేను లోన్లీ కాదు' అని ఆయన తెలిపారు. కొన్నిసార్లు నిరంతరం జనాల్లో ఉండటం వల్ల అలసటగా అనిపించి, తన కోసం కొంత సమయం కావాలనిపిస్తుందని, అదే భావంతో ఆ పోస్ట్ పెట్టానని వివరించారు.

ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులే కంగారుపడ్డారు. "మీరు అంతగా హైలైట్ చేయడంతో మా అమ్మ కూడా 'ఏమైంది?' అని అడిగింది" అని సల్మాన్ చెప్పడం గమనార్హం.దీంతో ఆయన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి "చిల్ అవ్వండి... అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు" అంటూ సరదాగా స్పందించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'మాతృభూమి' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, ఒక సాధారణ ఆలోచనను పంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన పోస్ట్ అనవసరమైన ఊహాగానాలకు దారి తీసింది. అయితే సల్మాన్ ఇచ్చిన క్లారిటీతో అభిమానులు రిలాక్స్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X