Tiger 3 చరిత్ర సృష్టించిన సల్మాన్ ఖాన్.. టైగర్ 3 మూవీతో 17వ సారి ఆ రికార్డు!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ ఓ రికార్డు క్రియేట్ చేశారు. బాక్సాఫీస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిన సల్లూభాయ్ ఇటీవల కాలంలో ఘోర పరాజయాలను చవిచూశారు. అయితే ఆ ఫెయల్యూర్‌కు టైగర్ అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా రికార్డుల వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్‌కు బాక్సాఫీస్ వద్ద కాసులను రాల్చడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల తడబాబుకు గురైనప్పటికీ.. ఆయన 100 కోట్ల క్లబ్‌లో ఇప్పటి వరకు 16 సినిమాలు చేరాయి. తాజాగా టైగర్ 3 చిత్రం కూడా వంద కోట్లు రాబట్టడంతో 17వ సారి ఆ ఘనత సాధించిన హీరోగా ఓ చరిత్ర సృష్టించాడు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దబాంగ్ మూవీ సల్మాన్ ఖాన్‌ను 100 కోట్ల క్లబ్‌లో తొలిసారి చేర్చింది. ఈ చిత్రం 140 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఆ తర్వాత రెడీ చిత్రం 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత బాడీ గార్డ్ 149 కోట్లు, ఏక థా టైగర్ 155 కోట్లు, దబాంగ్ 2 చిత్రం 155 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక సల్మాన్ ఖాన్ 100 కోట్ల జర్నీ అంతటితో ఆగలేదు. జయ హో చ ిత్రం 117 కోట్లు, కిక్ 230 కోట్ల రూపాయలు, బజరంగీ భాయ్‌జాన్ చిత్రం 320 కోట్ల రూపాయలు, ప్రేమ్ రతన్ ధన్ పాయో 210 కోట్లు, సల్తాన్ 300 కోట్లు వసూలు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ కెరీర్‌లో దారుణమైన ఫెయిల్యూర్‌గా మారిన ట్యూబ్ లైట్ చిత్రం కూడా 120 కోట్లు రాబట్టింది.

అలాగే టైగర్ సిరీస్‌లో టైగర్ జిందా హై చిత్రం 340 కోట్ల రూపాయలు, అట్టర్ ఫ్లాఫ్ మూవీ భారత్ 212 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వత వచ్చిన దంబాగ్ చిత్రం 150 కోట్ల రూపాయలు, కిసి కా భాయ్ కిసీ కీ జాన్ 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చివరి మూడు చిత్రాలు డిజాస్టర్ అయినప్పటికీ సల్మాన్ ఖాన్ 100 కొల్లగొట్టి తన స్టామినాను నిరూపించుకొన్నాడు.
తాజాగా రిలీజైన సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 చిత్రం కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. దాంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన 17వ సినిమాగా రికార్డు సొంతం చేసుకొన్నది. తొలి రోజు 45 కోట్లు సంపాదించిన ఈ సినిమా రెండో రోజు అదే జోష్‌తో 60 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 105 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











