For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సల్మాన్ ఖాన్ ఫస్ట్ రెమ్యునరేషన్.. జూనియర్ ఆర్టిస్ట్ కంటే తక్కువే.. లిప్ లాక్ ఎందుకు ఇవ్వడంటే?

  |

  ఇండియన్ సినిమా హిస్టరిలో అత్యదిక మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 32ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా అతని స్థాయి ఏ మాత్రం తగ్గలేదు. ఇక నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అతని అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం వందల కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్న సల్మాన్ ఖాన్ కెరీర్ మొదట్లో ఎంత తక్కువ రెమ్యునరేషన్ ని అందుకున్నాడో తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

  వయసుతో మోసం చేసే సల్మాన్ ఖాన్

  వయసుతో మోసం చేసే సల్మాన్ ఖాన్

  నేటితో సల్మాన్ ఖాన్ వయసు 55 ఏళ్ళు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఫీట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. డైట్ మొదలు పెడితే ఎంతో కఠినంగా ఉంటాడు. ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా సల్మాన్ ఖాన్ అప్పుడే 30లోకి వచ్చిన కుర్రాడిలా కనిపిస్తూ ఉంటాడు. వయసు 50 దాటింది అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుందని చాలా మంది స్టార్స్ సల్మాన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు.

  మొదటి రోజే భారీ కలెక్షన్స్

  మొదటి రోజే భారీ కలెక్షన్స్

  సల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ మూడు వందల కోట్ల రూపాయలకు తక్కువ కలెక్షన్స్ వసూళ్లు చేయవు. ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి రెండు మూడు రోజుల్లోనే పెట్టినపెట్టుబడికి తగ్గట్లుగానే కలెక్షన్స్ వస్తాయి. ఇక ఆ సంఖ్య 600కోట్లకు కూడా పెరుగుతుంది. ఇక ప్రతి ఏడాది కూడా అతని రెమ్యునరేషన్ అంతకంతకు పెరిగుతూనే ఉంది.

  ఒక్కో సినిమాకు అతను అందుకునే రెమ్యునరేషన్..

  ఒక్కో సినిమాకు అతను అందుకునే రెమ్యునరేషన్..

  ఇటీవల కాలంలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ నటులలో సల్మాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఒక సినిమాకు అతను అందుకునే పారితోషికం 65కోట్ల నుంచి 70కోట్ల వరకు ఉంటుందట. ఈ లెక్క ప్రతి సినిమాకు కూడా పెరుగుతూనే ఉంది. అంతే కాకుండా సినిమా ప్రాఫిట్స్ లో కూడా షేర్ ఉంటుంది. ఇక ఎక్కువగా సల్మాన్ తన ప్రొడక్షన్ ను కూడా సినిమా నిర్మాణ సంస్థలతో కలిపి బోనస్ లు కూడా అందుకుంటూ ఉంటాడు.

  మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..

  మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇప్పుడు ఏడాదికి యాడ్స్ అలాగే సినిమాలతో కలిసి దాదాపు 150కోట్లకు పైగా సంపదిస్తున్న సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఎంత రెమ్యునరేషన్ అందుకునేవాడో తెలిస్తే షాక్ అవుతారు. సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు సల్మాన్ ఒక మోడల్ గానే కాకుండా డ్యాన్సర్ గా కూడా జీవితాన్ని కొనసాగించాడు. అయితే అతని మొదటి జీతం కేవలం 75రూపాయలట.

  సైడ్ డ్యాన్సర్ గా చేసి..

  సైడ్ డ్యాన్సర్ గా చేసి..

  ఒక తాజ్ హోటల్ లో నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రామ్ లో సల్మాన్ ఖాన్ సైడ్ డ్యాన్సర్ గా చేశాడట. అతని ఫ్రెండ్ సరదాగా పిలిస్తే డ్యాన్స్ గ్రూప్ లో వెనకాల నుంచొని వచ్చి రాని స్టెప్పులు వేయగా అందుకు 75రూపాయల పేమెంట్ ఇచ్చినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆ తరువాత బివి హో తో ఐసి చిత్రంతో 1989 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరంలో విడుదలైన మైనే ప్యార్ కియా తర్వాత సల్మాన్ కు మరింత గుర్తింపు లభించింది.

  ఆ తరువాత ఎంత పెరిగిందంటే..

  ఆ తరువాత ఎంత పెరిగిందంటే..

  ఇక మొదటి సారి ఒక కూల్ డ్రింక్ కంపెనీకి చెందిన యాడ్ లో నటించినప్పుడు 750 రూపాయల వరకు అనుకున్నాడట. తరువాత కొంత కాలానికి రేటు 1,500 రూపాయలకి పెరిగింది. ఇక మైనే ప్యార్ కియా సినిమాకు రూ .31 వేలు చెల్లించారని తరువాత 75వేల రూపాయలకు రెమ్యునరేషన్ పేరిగినట్లు సల్మాన్ ఖాన్ వివరణ ఇచ్చారు.ముద్దు సన్నివేశాల్లో ఎందుకు నటించడంటే..

  సల్మాన్ ఖాన్ మాత్రం

  సల్మాన్ ఖాన్ మాత్రం

  ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరో హీరోయిన్స్ ఎదో ఒకసారి లిప్ లాక్ సీన్స్ చేసి వచ్చినవారే.. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం అలాంటి సీన్స్ లలో నటించడు. అందుకు కారణం ఏ కథ కూడా లిప్ లాక్ కిస్ చేయమని డిమాండ్ చేయదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సల్మాన్ ఖాన్.

  ఆన్ స్క్రీన్ పై హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రానా అందరికి కనిపించేలా లిప్ లాక్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే అలా ఒక్కసారి నటిస్తే మిగతా సినిమా వాళ్ళు కూడా ముద్దు సీన్స్ చేయాలని డిమాండ్ చేస్తారని సల్మాన్ వివరణ ఇచ్చారు.

  English summary
  Salman khan first remuneration in his total career, Salman Khan is someone who wants to cash in on the star image. Craze offers celebrity status in his own style and generates thousands of crores a year. Salman is giving salaries of less than a lakh to the workers he works with. The star hero seems to have a plan to increase his income once again with Bigg Boss, which is an integral part of the income.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X