twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతుగా మారిన సల్మాన్ ఖాన్.. కష్టపడి పొలం పని చేస్తున్నాడట.. ఫొటోస్ వైరల్

    |

    రైతే రాజు అనే పదం గురించి ప్రతి ఒక్క సెలబ్రెటీ మాట్లాడుతుంటారు. కానీ ఒక్కరోజైనా రైతుగా బ్రతికే పని మాత్రం చాలా తక్కువ మంది ఆచరణలో పెడుతుంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అదే తరహాలో రైతుగా మారి చూపించాడు. గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ ఖాన్ తన ఫార్మ్ హౌజ్ లోనే సేదతీరుతున్న విషయం తెలిసిందే. అక్కడే తన కుటుంన సభ్యులతో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

     ఫార్మ్ హౌజ్ లోనే..

    ఫార్మ్ హౌజ్ లోనే..

    లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సల్మాన్ ఖాన్ ముంబై నగరానికి దూరంగా ఉంటున్నాడు. తనకు సంబంధించిన ఆఫీసులను ఇంటిని కూడా దూరంగా ఉంటూ.. ఎవరు రాకుండా క్లోజ్ చేశాడు. పన్వెల్ లో ఉన్న తన ఫార్మ్ హౌజ్ లోనే ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సల్మాన్ కరోనా వైరస్ తగ్గే వరకు ఫార్మ్ హౌజ్ నుంచి బయటకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు.

    ఫోటో వైరల్..

    ఫోటో వైరల్..

    ఇక చాలా రోజుల తరువాత ఒక స్పెషల్ ఫోటోతో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు మంచి సందేశాన్ని ఇచ్చాడు. అదే విధంగా ఒక స్పెషల్ ఫోటోని కూడా షేర్ చేశారు. గ్రే కలర్ టీ షర్ట్, అలాగే షార్ట్ ధరించిన సల్మాన్ పచ్చని పొలంలో పని చేస్తూ కనిపించాడు. ఆకట్టుకునే స్మైల్ తో చేతిలో వరి నాట్లు పట్టుకొని అద్భుతమైన స్టిల్ ఇచ్చాడు. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    జై జవాన్..జై కిసాన్..

    జై జవాన్..జై కిసాన్..

    ప్రతి ధాన్యంపై వినియోగదారుని పేరును కలిగి ఉంటుందని మంచి లైన్ చెప్పిన సల్మాన్ ఖాన్ జై జవాన్! జై కిసాన్! అనే కామెంట్ కూడా చేశాడు. ఇక పోస్ట్ చేసిన కొన్ని గంటలకే సల్మాన్ ఖాన్ 1 మిలియన్ లైక్స్ ను అందుకొని ప్రస్తుతం 2 మిలియన్స్ లైక్స్ అందుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ తో పాటు హీరోయిన్స్ జక్వాలిన్, లూలియా కూడా ఫార్మ్ హౌజ్ లోనే ఉంటున్నారు.

    Recommended Video

    #AmitabhBachchan : Coronavirus సోకిన తరువాత మొదటిసారి మాట్లాడిన Amitabh Bachchan..!
    నెక్స్ట్ మూవీ అదే..

    నెక్స్ట్ మూవీ అదే..

    సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ సమయం నుంచి పూర్తిగా తన లైఫ్ ని ఫార్మ్ హౌజ్ కి షిఫ్ట్ చేశాడు. స్వచ్ఛ భారత్ లో భాగంగా అక్కడే ఫార్మ్ హౌజ్ ని శుభ్రం చేశాడు కూడా. సొంతంగా పనులు చేసుకుంటున్న సల్మాన్ ఇప్పుడు రైతుగా కనిపించడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని అందిస్తోంది. ఇక నెక్స్ట్ సల్మాన్ ఖాన్ రాధే సినిమాతో రాబోతున్నాడు. ప్రభుదేవా ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

    English summary
    Salman Khan is someone who wants to cash in on the star image. Craze offers celebrity status in his own style and generates thousands of crores a year. Salman is giving salaries of less than a lakh to the workers he works with. The star hero seems to have a plan to increase his income once again with Bigg Boss, which is an integral part of the income
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X