'భారత్' టీజర్ వచ్చేసింది.. స్టైలిష్ ఎంట్రీతో అదరగొట్టిన సల్మాన్!
సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. అలీ అబ్బాస్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సల్మాన్ ఖాన్ సరసన హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. రేపు రిపబ్లిక్ డేని పురస్కరించుకుని నేడు చిత్ర యూనిట్ భారత్ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ఆరంభంలో బ్రిటిష్ కాలంలో ప్రజలు చేస్తున్న స్వాతంత్ర ఉద్యమాన్ని చూపిస్తారు. అప్పుడు చిన్న పిల్లవాడిగా సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు.
బ్యాగ్రౌండ్ వాయిస్ లో సల్మాన్ ఖాన్ తనకు భారత్ అనే పేరు ఎలా వచ్చిందో వివరిస్తుంటాడు. 'నా ఇంటిపేరు ఏంటి, జాతి ఏంటి అని అందరూ అడుగుతున్నారు' అంటూ సల్మాన్ ఖాన్ డైలాగులు వినిపిస్తాయి. ఈ లోపు నేవి అధికారిగా సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్ లో సల్మాన్ ఖాన్ స్టైలిష్ గా కనిపిస్తాడు. మా నాన్నే నాకు భారత్ అని పేరు పెట్టినట్లు సల్మాన్ ఖాన్ వివరిస్తాడు.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్ మరో లుక్ లో కనిపిస్తాడు.సూపర్ స్టైలిష్ గా ఉండే సల్మాన్ గాగుల్స్ పెట్టుకుని, బైక్ పై మంటల మధ్యలో నుంచి ఎంట్రీ ఇస్తాడు. సల్మాన్ ఖాన్ అభిమానులు పండగ చేసుకునే విధంగా ఈ టీజర్ ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలకు కూడా దర్శకుడు పెద్ద పీట వేసినట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. ఈ ఏడాది రంజాన్ రోజన భారత్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











