సల్మాన్ కార్‌వాన్ చూస్తే షాకే.. ఇంధ్రభవనాన్ని తలపించే విధంగా

By Rajababu

ఒకప్పుడు షూటింగ్‌ సమయంలో షాట్ లేకున్నా హీరో, హీరోయిన్లు లొకేషన్లలో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. చిన్న చితకా నటీ, నటులు కూడా కార్‌వాన్‌లు లేదా వ్యానిటీ వ్యాన్‌లు ఉపయోగిస్తున్నారు. షాట్ గ్యాప్‌లో వ్యాన్‌లోకి వెళ్లి సేద తీరుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్‌కు సంబంధించి కార్‌వాన్ ఫొటోలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ కోసం డిజైన్ చేసిన కార్‌వాన్‌ ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది. కార్‌వాన్‌కు సంబంధించిన బయటి, లోపలి ఫోటోలను కళ్లప్పగించి చూడాల్సిందే. అందంగా లోపల ఏర్పాటు చేసిన సోఫాలు, కిచెన్, లివింగ్ రూమ్ సంపన్నుల భవంతిని తలపించేలా ఉంది. లోపలకి వెళ్లి చూస్తే వ్యాన్‌లో ఉన్నామనే ఫీలింగ్ ఏ మాత్రం కనిపించదు.

Salman Khans luxury vanity van like Indra Bhavan

సల్మాన్ ఖాన్ భారత్ సినిమా షూటింగ్ మాల్టాలో జరుగుతున్నది. మాల్టాలో సల్మాన్ ఖాన్ వ్యానిటీ వ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సల్మాన్ కోసం నిర్మాత నిఖిల్ నమిత్ ప్రత్యేకంగా కార్‌వాన్‌ను రూపొందించారు. ఈ వ్యాన్‌లో సల్మాన్‌కు రాజభోగాలను అందజేస్తున్నారట.

సల్మాన్ ఖాన్ మాల్టాలో ఉన్నందున తన సోదరి, భావ అతుల్ అగ్నిహోత్రి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. తన వద్ద కొన్నిరోజులు ఉండి వచ్చారు. అలీ అబ్బాస్ జాఫర్ రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నది.

Salman Khans luxury vanity van like Indra Bhavan

భారత్ చిత్రం నుంచి హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా తప్పుకోవడంతో కత్రినా కైఫ్ తెరపైకి వచ్చింది. సల్మాన్‌తో కలిసి నటించేందుకు కత్రినా మాల్టాకు ఇటీవలే చేరుకొన్నది. కొరియా భాషలో విజయవంతమైన యాన్ ఓడ్ టు మై ఫాదర్ అనే చిత్రం ఆధారంగా భారత్ రూపొందుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X