వృద్ధుడిగా సల్మాన్ ఖాన్.. వైరల్ అవుతున్న లుక్!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకుడు. సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. భారత్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. మరోసారి కత్రినా కైఫ్ ఈ చిత్రంలో సల్మాన్ తో జోడి కట్టింది. రంజాన్ సందర్భంగాభారత్ చిత్రం విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తన లుక్ ని స్వయంగా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. వృద్దుడిగా సల్మాన్ ఖాన్ లుక్ అదరగొడుతోంది. ఈ ఫోటో చూస్తుంటే సల్మాన్ ఖాన్ తన పాత్రలో ఎలా ఒదిగిపోయాడో అర్థం అవుతుంది. సల్మాన్ ఖాన్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఓ వ్యక్తి జర్నీగా అలీ అబ్బాస్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ వివిధ వయసులలో వివిధ గెటప్పులలో కనిపిస్తాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటాని, సునీల్ గ్రోవర్, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ శేఖర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది.


Click it and Unblock the Notifications











