మగతనాన్ని కోరుకోవడం లేదు. .సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో ఎప్పుడూ వెనుకాడరు. మనసులో ఎలాంటి భావాలు ఉన్నా వాటిని తనకు తోచిన విధంగా వెల్లడించడం వల్ల కొన్ని సార్లు వివాదాలకు గురయ్యారు.. మరికొన్ని సార్లు ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా పురుషత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సల్లూ భాయ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయిత సలీం ఖాన్ కొడుకుగా సల్మాన్ ఖాన్ సుపరిచితుడే. అయితే సలీం ఖాన్, జావెద్ ఖాన్ ఇద్దరు కలిసి బాలీవుడ్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలను సృష్టించి సినిమా రంగాన్ని శాసించారు. వారు రాసిన కథలతో వచ్చిన చిత్రాలు షోలే, జంజీర్, డాన్, దీవార్, త్రిశూల్ లాంటి చిత్రాలు సంచలన విజయం సాధించాయి. ధర్మేంద్ర, అమితాబ్ లాంటి హీరోలు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ట్యాగ్‌ను తగిలించుకొనేలా చేశాయి.

ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే కాన్సెప్ట్‌తో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ డ్యాక్యుమెంటరీని షూట్ చేస్తున్నది. దీని కోసం హిందీలోని సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలను చేస్తున్నది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, సలీం ఖాన్, జావెద్ అఖ్తర్ ఈ ఇంటర్వ్యూ వేదికలో పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. సలీం, జావెద్ లాంటి రచయితలు తమ జీవితకాలంలో తమ చుట్టూ చూసిన పరిసరాలను, వ్యక్తులను ఊహించుకొని తెర మీద యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలను క్రియేట్ చేసి సంచలన విజయాలను అందుకొన్నారు. హిందీ సినిమా రంగాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లారు.

ఇటీవల కాలంలో పురుషులు మగతానాన్ని కోరుకోవడం లేదు. దేవుడు పురుషులుగా జన్మను ప్రసాదిస్తున్నారు. కానీ ఈ తరం వాళ్లు ఆ పురుషత్వాన్ని కోరుకోవడం లేదు. ఇక్కడ వేదిక మీద ఉన్న సలీం, జావెద్ ఇద్దరు పురుషులుగానే ఉన్నారు. ఇంకా మగతనాన్ని చూపిస్తున్నారు. తాము సృష్టించే పాత్రల ద్వారా మగతనాన్ని నిరూపించుకొంటూనే ఉంటారు అని అన్నారు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌కు కోట్లాది మంది అభిమానులను సంపాదించిన సినీ రచయితలు, హీరోలు, ఇతర సాంకేతిక నిపుణుల అభిప్రాయాల ద్వారా యాగ్రీ యంగ్ మెన్ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను ఆగస్టు 20వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నది.


Click it and Unblock the Notifications











