బాపూజీ సబర్మతి ఆశ్రమంలో సల్మాన్ ఖాన్.. బారికేడ్లు విరగకొట్టి అభిమానుల రచ్చ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాను నిర్మించిన అంతిమ్ అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆహ్మాదాబాద్‌లోని మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. సబర్మతీ ఆశ్రమంలో బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమంలోని చరఖాను తిప్పి ఖాదీ వస్త్రాన్ని నేశారు. 1930లో కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ నివసించిన హృదయ్ కుంజ్‌ను కూడా సందర్శించారు. 1917 నుంచి 1930 వరకు హరిజన్ ఆశ్రమ్ అనే సబర్మతి ఆశ్రమంలో నివసించారు. ఇక్కడి నుంచే భారతీయ స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యూహా రచన చేశారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించిన సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత సందర్శకుల పుస్తకంలో ఓ సందేశాన్ని రాశారు.
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం గర్వంగా ఉంది. బాపూజీ ఆశ్రమానికి రావడం నాకు చాలా ఇష్టం. ఇది నాకు గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ ఆశ్రమానికి నా హృదయంలో గొప్ప స్థానం ఉంది. ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచోపలేను. తొలిసారి నేను చరఖా తిప్పాను. జాతీకి స్పూర్తిగా నిలిచిన దేవుడి లాంటి గాంధీజీ దీవెనలు అందుకొన్నాను. మరోసారి సందర్శించినప్పుడు మరిన్ని విషయాలు నేర్చుకొంటాను అని సల్మాన్ ఖాన్ తన సందేశంలో రాశారు.

సబర్మతి ఆశ్రమానికి సల్మాన్ ఖాన్ వచ్చారనే విషయాన్ని తెలుసుకొన్న అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చారు. సల్మాన్ ఖాన్‌తో ఫోటోలు దిగేందుకు భారీ సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. దాంతో అక్కడి బారికేట్లు విరిగిపోయాయి. ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇక తన బావ ఆయుష్ షర్మ రూపొందించిన అంతిమ్ సినిమా ఇటీవల రిలీజైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ప్రమోషన్‌లో భాగమయ్యారు.


Click it and Unblock the Notifications











