విడాకుల తర్వా మొదటిసారి కలుసుకొన్న చైతన్య, సమంత.. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకులు తీసుకున్న స్టార్ కపుల్స్ నాగచైతన్య సమంత అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల ప్రయాణం తర్వాత వారిద్దరు కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా విడిపోవడం జరిగింది. ఒక విధంగా అభిమానులకు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ కూడా చైతన్య సమంత ఇద్దరూ కూడా వారిని నచ్చినట్లుగా ఉండాలి అని నిర్ణయాలు తీసుకునే విడాకులు తీసుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత మొదటిసారి వారు ఒకే స్టూడియోలో కలిసి పని చేసే సందర్భం ఎదురైనట్లు తెలుస్తోంది.

కాంట్రవర్సీలకు వెళ్లకుండా..
అక్కినేని హీరో నాగ చైతన్య ఎంత సింపుల్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కాంట్రవర్సి విషయాలకు వెళ్లకుండా కేవలం తన కెరీర్ ను అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్పితే ఇతర విషయాల్లో ఏమాత్రం తలదూర్చడు. ఇక అతన్ని ఎంతగానో ఇష్టపడే సమంత ఐదేళ్ల ప్రేమ అనంతరం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. ఇక పదేళ్ల అనంతరం వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

ఇబ్బంది కలిగించవద్దు అని
సమంత నాగచైతన్య విడిపోవడం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వీరు మాత్రం వ్యక్తిగత కారణాల వలన ఒకరినొకరు నొప్పించకుండా విడిపోతున్నట్లు గా వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తమకు ఫ్యాన్స్ నుంచి మీడియా నుంచి కూడా మద్దతు కావాలని తమ ప్రైవసీకి ఏమాత్రం ఇబ్బంది కలిగించవద్దు అని ప్రత్యేకంగా నాగచైతన్య సమంత సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

మరో స్థాయికి వెళ్లేలా..
ఇక సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు చాలా బిజీ అయిపోయారు. ఒకవిధంగా విడాకులు అనంతరం సమంత ఎవరూ ఊహించని విధంగా తన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కెరీర్లో మరో స్థాయికి వెళ్లేలా సమంత సరికొత్త పాత్రలను సెలెక్ట్ చేసుకుంటోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి కంటెంట్ ఉన్న సినిమాలను, పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంది.

విడాకుల తరువాత..
మరోవైపు నాగచైతన్య కూడా శరవేగంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇటీవల విడాకుల అనంతరం వీరిద్దరూ మొదటిసారి ఎదురుపడిన సందర్భం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి షూటింగ్ ఒకేసారి రామానాయుడు స్టూడియోలో జరగడంతో విషయం మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఎదురుపడకుండా..
నాగచైతన్య బంగార్రాజు షూటింగ్ ను ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే అదే సమయంలో సమంత కూడా యశోద సినిమా షూటింగ్ ను అక్కడే మొదలు పెట్టింది. ఓకే రోజు ఇద్దరు షూటింగ్స్ ఉండడంతో కొంత అసౌకర్యం గానే ఫీల్ అయ్యారట. ముందుగానే వారి అసిస్టెంట్ కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎదురు పడకుండా చూసుకోవాలి అని ముందుగానే అనుకున్నారనీ సోషల్ మీడియాలో కూడా కథనాలు వినిపిస్తున్నాయి.

షూటింగ్స్ తో బిజీగా..
ఏదేమైనా కూడా నాగచైతన్య సమంత ఇద్దరూ మళ్లీ ఎలాంటి ఐ కాంటాక్ట్ కూడా లేకుండా ఉండడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక వారి సొంత నిర్ణయాల ప్రకారం ఈ జీవితాన్ని కొనసాగించేందుకు ముందుకు వెళుతున్నట్లు అర్థమవుతోంది. సమంత వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండగా ఇక నాగచైతన్య ప్రస్తుతం బంగార్రాజు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











