సమంత నన్ను బెదిరించింది.. అసలు విషయం బయట పెట్టిన నాగ చైతన్య
Naga Chaitanya- Samantha : ఒకప్పుడు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య - సమంత . వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ వీరి వివాహ బంధం ముడున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఏమైందో తెలియదు.. విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే వీరిద్దరూ తిరిగి కలుస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, ఫలితం లేదు. ఇటీవల నాగచైతన్య.. బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సమంత.. పెళ్లికి ముందు బెదిరించిందని షాకింగ్ కామెంట్స్ చేశారు నాగచైతన్య. ఇంతకీ నాగచైతన్యను సమంత ఏ విషయంలో బెదిరించిందో? మీరు కూడా తెలుసుకోండి.
ఇక సమంత, నాగచైతన్యలు తొలిసారి ఏం మాయ చేశావే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ జంటకు మంచి పాపులర్టీ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఏమాయ చేశావేతో పాటు మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాలొచ్చాయి. అయితే.. ఏం మాయ చేశావే సినిమాలోనే నాగ చైతన్య, సమంత లు ప్రేమలో పడ్డారు. ఎళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట పెద్దలను ఒప్పించి 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసుండలేక .. 2021లో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీళ్ల విడాకులపై అప్పట్లో జరిగిన చర్చలు అన్ని ఇన్నీ కావు.

వీళ్ళిద్దరూ ఏ కారణంతో విడిపోయారు ఎవరికీ తెలియదు. ఆ విషయంలో ఇటు నాగచైతన్య గాని, అటు సమంతా గాని, ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే అసలు కారణాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇప్పటికీ వీళ్లద్దరు ఏ కారణం వల్ల విడిపోయారనేది క్లారిటీ లేదు. దీంతో ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు చెబుతూ పలు రూమర్సును క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే నాగచైతన్య డిసెంబర్ 4 న తన ప్రేమించిన శోభిత దూలిపాలతో రెండో వివాహం చేసుకొని మరోసారి సర్ప్రైజ్ చేశాడు నాగ చైతన్య.
ఇదెలా ఉంటే.. నాగచైతన్యకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో నాగచైతన్య తన మాజీ భార్య సమంత గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అలాగే తమ రిలేషన్ షిప్ లోని ఒడిదుడుకులను కూడా అందులో పేర్కొన్నాడు. తమ రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పడం ఆలస్యం చేయడంతో సమంత తనని బెదిరించినట్లు నాగచైతన్య ఆనాటి ఘటనను గుర్తుకు చేసుకున్నాడు. నాగ చైతన్య.. తన లవ్ స్టోరీని,సమంతా రూత్ ప్రభుతో ఉన్న సంబంధాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడానికి వెనుకాడాడు. దీంతో హీరోయిన్ సమంత బెదిరింపులకు పాల్పడిందట. తమ ప్రేమ విషయాన్ని నాగ చైతన్య తన కుటుంబ సభ్యులకు చెప్పేలా చేసింది.

నాగ చైతన్య ఓ పాత ఇంటర్వ్యూలో ఇలా వెల్లడించాడు, "మేము 2009లో ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాం. తరువాతి చాలా సంవత్సరాలు మా ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే.. సామ్ పట్టుబట్టినప్పటికీ నేను నా ప్రేమ విషయం గురించి నా తల్లిదండ్రులకు చెప్పడం ఆలస్యం చేస్తున్నాను. ఒకరోజు మేమిద్దరం క్యాజువల్‌గా మేము మాట్లాడుకుంటున్నాం. ప్రేమ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పకుంటే రాఖీ కట్టేస్తానని సామ్ బెదిరించింది. ఆమె బెదిరింపులకు నేను షాక్ అయ్యాను. దీంతో వెంటనే నా ప్రేమ గురించి నా తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించాను' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











