అంత ఈజీ అనుకున్నావా? హీరో పోస్ట్ మీద సమంత కామెంట్.. నాశనం చేశారంటున్న హీరో!
విడాకుల తర్వాత సమంత ఏమి చేసినా హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆమె తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అడపాదడపా వీడియోలు షేర్ చేస్తూ చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. అయితే ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఇతర సెలబ్రిటీల పోస్టుల మీద కామెంట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె యంగ్ హీరో తేజ సజ్జా ఫోటోల మీద కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు

ఆటపట్టించేందుకు
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఆమె తన స్వంత అప్‌డేట్‌లను పోస్ట్ చేయడానికి మాత్రమే కాకుండా తన ఖాతాను విరివిగా ఉపయోగిస్తుంది. ఆమె ఇతర హీరోయిన్స్ ను మెచ్చుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడదు . ఎప్పటికప్పుడు వారి వారి ఫోటోల మీద కామెంట్లు చేస్తూ కోస్టార్‌లతో సంభాషణలు జరుపుతూ ఉంటుంది కూడా. ఇక ఇప్పుడు ఓ బేబీ సినిమాలో తన కోస్టార్ అయిన యంగ్ హీరో 'తేజ సజ్జ'ని ఆటపట్టించేందుకు ప్రయత్నించింది.

ఈజీ అనుకున్నావా?
అసలు విషయం ఏంటంటే తేజ సజ్జా ఇటీవల ఫోటోషూట్ నుంచి తన రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు, చేసి దానికి ఎక్స్ క్యూజ్ మీ లేడీస్ అని క్యాప్షన్ ఇచ్చాడు. అంతే కాక డానికి ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా ట్యాగ్ చేశాడు. ఆ పోస్ట్ కి స్పందించిన సమంత - 'అంటే? ఒక్క చిత్రం కోసం ఆహ్ .. అంత ఈజీ అనుకున్నావా .. మనం అతనికి ఏమీ నేర్పించలేదా' అంటూ నందిని రెడ్డి మీద సీరియస్ అయింది.

స్వాగ్ నాశనం
ఈ దెబ్బకు "ఇప్పుడు మీరు నా మొత్తం స్వాగ్ నాశనం చేశారు, " అని తేజ ఫీల్ అవుతూ కామెంట్ చేశాడు. సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయింది. సమంత విషయానికి వస్తే ఆమె ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో ఆమె బాలీవుడ్ లోనూ మంచి మార్కెట్‌ని ఏర్పర్చుకుంది.

ఇంటర్నెషనల్ ప్రాజెక్ట్
అంతకు ముందు సౌత్‌లో మెప్పించిన సమంత ఈ వెబ్ సిరీస్‌తో అన్ని బాషలలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం సమంత సౌత్‌తోపాటు హిందీలో సినిమాలకు కమిట్ అయినట్టు టాక్ వినిపుస్తోంది. మరో వైపు అనూహ్యంగా సమంత ఒక ఇంటర్నెషనల్ ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేసింది. దీంతో సమంత పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌ని దాటేయబోతుందని చెప్పక తప్పదు.
Recommended Video

శాకుంతలం
సమంత చివరగా ఓటీటీలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో కనువిందు చేసింది. ఇందులో రాజీ పాత్రలో జీవించింది. ఆ తరువాత ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` పాటలో డాన్స్ చేసి హోల్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. మరో పక్క ఆమె హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











