మెగా హీరోపై మనసు పడ్డ సమంత!
ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో మంచి ఫేమ్ ఉన్నటువంటి స్టార్ బ్యూటీస్ లో సమంత కూడా ఒకరు. కాగా సమంత తన సినీ కెరీర్ కి కొంచెం విరామం ఇచ్చి మళ్ళీ తన వర్క్ లో అయితే బిజీగా మారిపోయిది. కాగా ఇప్పుడు సమంత పలు వెబ్ సిరీస్ లు అలాగే సినిమాల్లో కూడా బిజీగా ఉండగా సోషల్ మీడియాలో కూడా సమంత ఎప్పటికపుడు యాక్టీవ్ గానే కనిపిస్తుంది.
అయితే సమంత తన ఇన్నేళ్ల కెరీర్ లో చాలా సినిమాలు చేసింది. అలాగే టాలీవుడ్ లో కూడా పలు భారీ సినిమాలు సోలోగా అలాగే దాదాపు అందరి స్టార్స్ తో కూడా సామ్ వర్క్ చేసి అదరగొట్టింది. ఐతే ఈమె వర్క్ చేసిన అందరి హీరోస్ లో కూడా ఓ మెగా హీరో విషయంలో మాత్రం సమంత కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ని చూపిస్తుంది అని చెప్పాలి. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నే..

మరి సమంత చరణ్ తో "రంగస్థలం" అనే భారీ ఇండస్ట్రీ హిట్ ని చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి చరణ్ తో సామ్ కి పరిచయం బాగా ఏర్పడింది. అయితే చరణ్ విషయంలో ఆమె చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఎగ్జైటింగ్ గా మారాయి. నిన్ననే చరణ్ భారీ చిత్రం "గేమ్ ఛేంజర్" నుంచి రా మచ్చా మచ్చా రా అనే సాంగ్ ని మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సాంగ్ ని చరణ్ తన ఇంస్టాగ్రామ్ లో కూడా సమంత ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యింది. చరణ్ కి ముందుగా కామెంట్ చేస్తూ "అన్ మ్యాచబుల్" అంటూ ఫైర్ ఎమోజీ పెట్టి చరణ్ ని ఎవరూ మ్యాచ్ చెయ్యలేరు అని ఆ సాంగ్ విషయంలో కామెంట్ చేయగా దీని తర్వాత మరో కామెంట్ కూడా చేసింది.

నేనేమంటున్నా అంటే ఒక హీరో ఇలా ఫార్మల్ షర్ట్, పాంట్స్ లో ఈ రేంజ్ లో డాన్స్ చెయ్యడం అనేది అంత సులభం కాదు అంటూ మరిన్ని ఫైర్ సింబల్స్ పెట్టి చరణ్ విషయంలో సమంత ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యింది. అయితే చరణ్ విషయంలో సమంత ఇంతలా ఎగ్జైట్ అవ్వడం అనేది ఇదే తొలిసారి కూడా కాదు. గతంలో కూడా మన టాలీవుడ్ హీరోస్ లో బెస్ట్ బాడీ ఎవరికైనా ఉంది అంటే అది చరణ్ కే అని చరణ్ తన బాడీని అద్భుతంగా మారుస్తూ స్టన్నింగ్ ఫిట్నెస్ మైంటైన్ చేస్తాడని కూడా తెలిపింది.
కాగా అప్పుడు తర్వాత మళ్ళీ సామ్ చరణ్ విషయంలో మరోసారి ఎగ్జైట్ అయ్యిందని చెప్పాలి. వీటితో చరణ్ పట్ల మిగతా మెగా హీరోస్ కంటే సామ్ దృష్టిలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనే అనుకోవచ్చు. ఇక సామ్ నటించిన స్పై థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" ఈ నవంబర్ లో రిలీజ్ కి రాబోతుండగా దీని తర్వాత "రక్త బ్రహ్మాండ్" అనే వెబ్ సిరీస్ లో తాను నటిస్తుంది. దీనిని "తుంబాడ్" దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











