For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్‌కు నిజమైన ప్రేమ కావాలంట.. ఆ హీరోకు నలుగురు లవర్స్.. చరణ్‌తో పోలుస్తూ..!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అక్కినేని అఖిల్, విజయ్ దేవరకొండ పేర్లు ప్రథమంగా వినబడతాయి. వీళ్లిద్దరికీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనన్న విషయం అందరికీ తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అమాంతం ఎక్కడికో ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ఫలితంతో మాత్రం చాలా నిరాశగా ఉన్నాడు. అదే సమయంలో కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేని అఖిల్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

   అఖిల్ ఆశలన్నీ దీని మీదే

  అఖిల్ ఆశలన్నీ దీని మీదే

  వరుస పరాజయాలతో ఢీలా పడిన అఖిల్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో కనిపిస్తున్నాడు. ఏడాది వయసులోనే ‘సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. ఇందులో భాగంగానే గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

  నిజమైన ప్రేమను వెతుకుతాడట

  నిజమైన ప్రేమను వెతుకుతాడట

  అఖిల్ ఎన్నో జాగ్రత్తలు పడిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై చాలా మంది ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వ ప్రతిభ గురించి తెలిసిన వారు ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో అఖిల్ నిజమైన ప్రేమ కోసం వెతుక్కుంటూ వెళ్లే యువకుడిలా కనిపిస్తాడట. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులే సినిమా కథ అని సమాచారం.

  విజయ్‌కు మాత్రం నలుగురు లవర్స్

  విజయ్‌కు మాత్రం నలుగురు లవర్స్

  ‘డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్'. ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్స్. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను కేఎస్‌ రామారావు సమర్పిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలను ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తాడట. ఈ నాలుగు ప్రేమ కథలను వివరించడమే సినిమా కథ అని టాక్.

  రామ్ చరణ్‌తో పోల్చేస్తున్నారు

  రామ్ చరణ్‌తో పోల్చేస్తున్నారు

  ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాల స్టోరీ లైన్స్ ఒకేలా అనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ రెండు సినిమాలను రామ్ చరణ్ గతంలో నటించిన ‘ఆరెంజ్' సినిమాతో పోల్చేస్తున్నారు. ‘మగధీర' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చెర్రీ నటించిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  ఎన్టీఆర్, కల్యాణ్ సక్సెస్ అయ్యారు

  ఎన్టీఆర్, కల్యాణ్ సక్సెస్ అయ్యారు

  ఒకే స్టోరీ లైన్‌తో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఏక కాలంలో వస్తే వాటిపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదు. ఫలితంగా ఆ రెండు సినిమాలు ప్రతికూల ఫలితాలను దక్కించుకుంటాయి. అయితే, 2015లో మాత్రం కల్యాణ్ రామ్ ‘పటాస్', జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్' ఒకే స్టోరీ లైన్‌తో వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల తర్వాత ఇప్పుడు అఖిల్, విజయ్ తమ అదృష్టాలను పరీక్షించుకోబోతున్నారని వినికిడి.

  English summary
  Tollywood Young Hero Akhil Akkineni Signs New Project In geeta arts 2 banner. This Film Directed By very Known Bommarillu Bhaskar. In This Movie, Famous Director Samudrakhani Plays Father Role For Akhil Akkineni.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X