రిపీట్ అవుతున్న ప్లాప్ కాంబినేషన్!
ఏమైంది ఈవేళ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సంపత్ నంది ఆ తర్వాత రచ్చ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రచ్చ చిత్రం కమర్షియల్ గా ఘన విజయం సాధించింది. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. 2017లో సంపత్ నంది హీరో గోపీచంద్ తో గౌతమ్ నంద చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఈ చిత్రం తర్వాత సంపత్ నంది నుంచి మరో చిత్రం రాలేదు. ఇటీవల సంపత్ నంది గోపీచంద్ కు ఓ కథ వినిపించాడట. కథ గోపించంద్ కు నచ్చినట్లు తెలుస్తోంది. తమ కాంబినేషన్ లో ప్లాప్ చిత్రం వచ్చినప్పటికీ సంపత్ పై నమ్మకంతో అతడి దర్శత్వంలో మరోమారు నటించేందుకు గోపిచంద్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

బెంగాల్ టైగర్ నిర్మాత రాధామోహన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ కు కూడా ఇటీవల సరైన హిట్ లేదు. దీనితో వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోపీచంద్ చివరగా నటించిన చిత్రం పంతం. గత ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











