For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వందల కోట్లు సంపాదించే హీరోల కంటే సంపూర్ణేష్ బాబు గ్రేట్.. ఆదాయం తక్కువైనా ఆగని విరాళాలు..

  |

  స్టార్ డమ్ ఎంత పెరిగినా కూడా కొంతమంది హీరోలు చాలా అనుకువతో ఉంటారు. అభిమానుల ప్రేమ వల్లే తారా స్థాయికి వచ్చాము అనేది అందరికి తెలిసిన విషయమే అయినా దాన్ని గ్రహించే మంచి గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా అలాంటి స్వచ్ఛమైన మనసుతోనే అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ఆదాయం ఎంత వస్తుంది అని విషయాన్ని పట్టించుకోకుండా అవసరమైన సమయాలలో నలుగురికి సహాయం చేస్తున్నాడు.

  స్థాయి ఎంత పెరిగినా కూడా

  స్థాయి ఎంత పెరిగినా కూడా

  సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రతి ఒక్క స్టార్ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చన వారే. ఎన్నో అవమానాలను దాటుకుంటూ వచ్చిన వారే. కానీ ఒక స్టేజ్ కు వచ్చిన తరువాత కొందరిలో సడన్ గా మార్పు వస్తుంటుంది. వారికి సహాయం చేసిన వారిని కూడా మర్చిపోతుంటారు. కానీ సంపూ మాత్రం తన స్థాయి ఎంత పెరిగినా కూడా ఏ సహాయాన్ని మరచిపోవడం లేదు.

  విమర్శలు వచ్చాయి.. కానీ

  విమర్శలు వచ్చాయి.. కానీ

  హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంపూ ఒక ఎన్నారై అంటూ కామెడీగా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో అతను డబ్బున్నవాడు అందుకే ఆ తరహాలో సిరియాస్ గా సినిమా తీసి కామెడీ చేసుకున్నాడు అనే విమర్శలు వచ్చాయి. కానీ నిజానికి అది కామెడీగా చేసిన సినిమానే అని చాలా లేటుగా జనాలకు అర్ధమయ్యింది.

  TNR ఫ్యామిలీకి సహాయం

  TNR ఫ్యామిలీకి సహాయం

  ఇక మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న సంపూర్ణేష్ బాబు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్లిపోయాడు. ఏ మాత్రం హడావుడి బిల్డప్ లేకుండా ఒక సాదారణ వ్యక్తిలా కలిసిపోతు వచ్చాడు. ఇక తనకు సహాయం చేసిన వారిని ఏ మాత్రం మరువకుండా కష్ట సమయంలో ఆదుకుంటున్నాడు. TNR మృతి చెందడంతో ఆయన ఫ్యామిలీకి 50వేలు విరాళంగా ఇచ్చాడు.

  TNR ఇంటర్వ్యూ ద్వారా

  TNR ఇంటర్వ్యూ ద్వారా

  TNR ఇంటర్వ్యూ ద్వారా సంపూర్ణేష్ బాబు లైఫ్ ఏమిటనేది చాలా మందికి తెలిసింది. అతని అసకు పేరు, ఊరు, వృత్తి ఇలా బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని విషయాలు మొత్తం జనాలకు తెలిసింది. ఇంటర్వ్యూలకు ఎవరు అంతగా పిలవని సమయంలో TNR లాంటి ప్రముఖ యాంకర్ నుంచి పిలుపు రావడం సంపుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

  ఆయన వల్ల ఒక్క మెట్టు ఎదిగాను అంటూ

  ఆయన వల్ల ఒక్క మెట్టు ఎదిగాను అంటూ

  ఆ కృతజ్ఞతను మరచిపోని సంపూ ఆయన వల్ల ఒక్క మెట్టు ఎదిగాను అంటూ ఆర్థికంగా సహాయం చేశాడు. ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి తన సపోర్ట్ ఉంటుందని మాట ఇచ్చాడు. సంపూ సహాయలు చేయడం కొత్తేమి కాదు. నిజానికి అతని ఆదాయం ఇప్పటికి కూడా కోట్లల్లో ఏమి లేదు. అయినా కూడా ఏదైనా విపత్తులు ఎదురైతే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూసుకోకుండా సహాయం చేస్తున్నాడు.

  Shakeela విషయంలో ఇది జరిగి ఉంటే గొప్ప నటి అయ్యేది ! || Filmibeat Telugu
  స్టార్ హీరోల కంటే గ్రేట్ అంటూ

  స్టార్ హీరోల కంటే గ్రేట్ అంటూ

  సంపూ తెలంగాణకు చెందినవాడు అయినప్పటికీ, ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. 2019 కర్ణాటక వరద సహాయ నిధికి రూ.2 లక్షలు పంపిన సంపూ 2018 లో శ్రీకాకుళం వరద సహాయ నిధి కోసం రూ.50,000 పంపాడు. గతేడాది హైదరాబాద్ వరద సహాయ నిధికి 50,000 రూపాయలు పంపిన విషయం తెలిసిందే.

  సంపూర్ణేష్ బాబు చేసిన సహాయల లెక్క ఇంకా చాలానే ఉంది. ఇక అభిమానులు అతను స్టార్ హీరోల కంటే గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. కేవలం లక్షల్లో ఆదాయం ఉన్న సంపూ ఈ రేంజ్ లో విరాళాలు అందిస్తున్నాడు అంటే వందల కోట్లున్న వారి గ్రేట్ అని అంటున్నారు.

  English summary
  No matter how much stardom grows, some heroes are very accommodating. It is a well known fact that we have reached the level of Tara due to the love of the fans but only a few have the good quality to realize it. Burning star Sampoornesh Babu is also getting closer to the fans with such a pure mind. He is helping four people in times of need regardless of how much income comes in.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X