twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూర్ణేష్ బాబు ‘బజారు రౌడీ’ షూటింగ్‌లో ప్రమాదం: బైక్ మీద నుంచి కింద పడ్డ బర్నింగ్ స్టార్

    |

    స్ఫూఫ్ సినిమాలు.. విచిత్రమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. 'హృదయ కాలేయం' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రమైన పాత్రలతో విభిన్నమైన గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్‌లోనూ అవకాశాన్ని అందుకుని హాట్ టాపిక్ అయ్యాడు సంపూ. కామెడీ చిత్రాలనే కాకుండా.. సీరియస్ సినిమాలను సైతం చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే మరో సినిమా చేస్తున్నాడు.

    ఓరచూపుతో కాల్చేస్తోంది.. దివ్యా గణేష్ పిక్స్ వైరల్

    వసంత నాగేశ్వరావు దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు నటిస్తోన్న చిత్రం 'బజారు రౌడీ'. కేఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ ప్రమాదం జరిగింది. క్లైమాక్స్ ఫైట్ సీన్ చిత్రీకరిస్తోన్న సమయంలో హీరో సంపూర్ణేష్ బాబు బైకు పైనుంచి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇక, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

    Sampoornesh Babu met Small Accident in Bazar Rowdy Sets

    షూటింగ్ స్పాట్‌లో ప్రమాదం జరిగినప్పటికీ.. సంపూర్ణేష్ బాబుకు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఇది జరిగిన వెంటనే అతడు విశ్రాంతి కూడా తీసుకోకుండా షూటింగ్‌ను కంటిన్యూ చేశాడని సమాచారం. ఇక, ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, రెండేళ్ల క్రితం సంపూర్ణేష్ బాబు 'కొబ్బరి మట్ట' అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

    English summary
    Sampoornesh Babu is an Indian film actor known for his works in the spoof comedy genre in Telugu cinema. He made his acting debut as the lead role in the 2014 film, Hrudaya Kaleyam, for which he won the CineMAA Award for Best Actor in a Comic Role. He is known for his comedic films and was also a contestant in Bigg Boss Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X