twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్‌కు గురి చేస్తున్న సంపూర్ణేశ్ బాబు రెమ్యూనరేషన్.. ఇంత తేడానా..?

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీకి అనూహ్య పరిస్థితుల్లో పరిచయమై, విచిత్రమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమాకు సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

    ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 3 కోట్లు పైగా షేర్ సాధించింది. ఈ మేరకు ఇటీవల చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

    Sampoornesh Babu Remuneration For New Movies

    ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సంపూర్ణేశ్ బాబు రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆయన మొదటి చిత్రం 'హృదయ కాలేయం' సినిమాకు లక్ష రూపాయలు కూడా తీసుకోలేదని గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని తర్వాత మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ సంపూ సాదాసీదా రెమ్యూనరేషనే తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే వెల్లడించాడు.

    అయితే, 'కొబ్బరి మట్ట' తర్వాత సంపూర్ణేశ్ బాబు.. రెండు సినిమాలను ఓకే చేసేశాడు. అలాగే తమిళంలోనూ ఓ సినిమా చేయడానికి సంతకం కూడా పెట్టేశాడు. ఈ సినిమాల కోసం సంపూ రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ సంపూ రెమ్యూనరేషన్ చూసి షాక్‌కు గురవుతున్నారు.

    English summary
    Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood. Now He acted Movie kobbari matta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X