Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
షాక్‌కు గురి చేస్తున్న సంపూర్ణేశ్ బాబు రెమ్యూనరేషన్.. ఇంత తేడానా..?
తెలుగు సినీ ఇండస్ట్రీకి అనూహ్య పరిస్థితుల్లో పరిచయమై, విచిత్రమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఇషికా సింగ్, గీతాంజలి, గాయత్రి గుప్తా, కత్తి మహేష్, షకీలా తదితరులు నటించారు. ఈ సినిమాకు సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.
ఈ సినిమా గత శనివారం విడుదలైంది. దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సినీ విమర్శలకులు సైతం ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చారు. దీంతో కలెక్షన్ల పరంగానూ 'కొబ్బరి మట్ట' దూసుకుపోతోంది. దీంతో చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 3 కోట్లు పైగా షేర్ సాధించింది. ఈ మేరకు ఇటీవల చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సంపూర్ణేశ్ బాబు రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఆయన మొదటి చిత్రం 'హృదయ కాలేయం' సినిమాకు లక్ష రూపాయలు కూడా తీసుకోలేదని గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. దీని తర్వాత మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ సంపూ సాదాసీదా రెమ్యూనరేషనే తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే వెల్లడించాడు.
అయితే, 'కొబ్బరి మట్ట' తర్వాత సంపూర్ణేశ్ బాబు.. రెండు సినిమాలను ఓకే చేసేశాడు. అలాగే తమిళంలోనూ ఓ సినిమా చేయడానికి సంతకం కూడా పెట్టేశాడు. ఈ సినిమాల కోసం సంపూ రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ సంపూ రెమ్యూనరేషన్ చూసి షాక్‌కు గురవుతున్నారు.