Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సెలబ్రిటీలకు షాక్: Be the REALMAN అంటే సంపూనే.. లాక్‌డౌన్‌లో భార్య, పిల్లల కోసం..
కరోనావైరస్ లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు ఇంటి పనుల్లో భాగమవుతున్నట్టు తెలిపే #BeTheRealMan ఛాలెంజ్‌కు నిజమైన అర్ధం చెప్పారు హీరో సంపూర్ణేష్ బాబు. తన కుల వృత్తికి గౌరవం తెచ్చే విధంగానే కాకుండా సాటి స్వర్ణకారులకు సమాజంలో గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని భుజాన కెత్తుకొన్నారు. తనను ఎవరూ పట్టించుకోకపోయినా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొనే పనిచేసిన సంపూపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తున్నది. స్వీయ గృహ నిర్బంధంలో సంపూ ఏం చేశాడో మీరో చూడండి..
Recommended Video

హృదయకాలేయంతో బర్నింగ్ స్టార్‌గా
హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకెచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. తొలి చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. తాజాగా కొబ్బరిమట్టలో తన నటనా, డైలాగ్ ప్రతిభతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. పెద్దగా మీడియాలో పాపులారిటీ కోసం పాకులాడని ఈ సిద్దిపేట నివాసి.. లాక్‌డౌన్ పిరియడ్‌లో తన చేతికి పని కల్పించాడు.

కులవృత్తితో వైరల్
సిద్దిపేటకు సమీపంలోని కుగ్రామంలో తన భార్య, పిల్లలతో గడుపుతున్న సంపూర్ణేష్ బాబు తన వృత్తిలో నిమగ్నమయ్యాడు. భార్యకు, పిల్లలకు పట్టగొలుసులు, ఉంగరాలు, ఇతర నగలు చేసి కానుకగా ఇచ్చాడు. తాను చేస్తున్న కౌసాలి పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
|
భార్య, పిల్లల కోసం
రాజు పేద తేడా లేదు...నీ ఆస్తి,డబ్బు నీ వెనక రావు..నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు గుర్తు చేసుకుంటున్న సమయం ఇది...మా ఆవిడ,పిల్లల కోసం నా "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసాను. #BetheREALMAN మీ @sampoornesh అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

ఇగోలకు, భేషజాలకు దూరంగా
టాలీవుడ్‌లో మంచి ప్రేక్షకాదరణ ఉన్న సంపూర్ణేష్ బాబు హంగులు, ఆర్బాటాలు, సినీ భేషజాలు, ఇగోలకు దూరంగా ఉంటారు. సినిమా షూటింగ్ లేకపోతే ఆయన తన సొంత ఊరులోనే ఉండటానికి ఉత్సాహం చూపుతారు. గ్రామ ప్రజలతో, తాను పెరిగిన మట్టితో మమేకం అవుతారు. సాధారణ పౌరుడిలా సైకిల్‌పై బిందెలు కట్టుకొని ఇంట్లో పనులు చేస్తారు. అవసరమైతే తన కులవృత్తిని నమ్ముకొంటారు. ఇలాంటి వ్యక్తి లాక్‌డౌన్‌లో సినీ ప్రముఖులకు తలదన్నేలా Be the REALMAN అనే పోటీ ఇలా ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు.