రమేష్ బాబు బాలకృష్ణ మధ్య వివాదం.. కృష్ణ ఎంట్రీతో మారిన సీన్.. ఏమైందో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఆకస్మిక మరణం ఒకరకంగా సినిమా ఇండస్ట్రీలో విషాదం నింపింది అనే చెప్పాలి. ఆయన మరణించిన క్రమంలో ఆయన సినీ కెరీర్ లో మొట్టమొదటి సినిమాతోనే బాలకృష్ణతో వివాదం ఏర్పడిందట. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా?

అస్వస్థతకు గురవడంతో

అస్వస్థతకు గురవడంతో

సూపర్ సార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు శనివారం రాత్రి ఆరోగ్య సమస్యలతో మరణించారు. లివర్ సంబంధిత వ్యాధితో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి.

సినిమా ఇండస్ట్రీకి పరిచయం

సినిమా ఇండస్ట్రీకి పరిచయం

అయితే తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ.. రమేష్ బాబు మాత్రం హీరోగా నిలదొక్కుకోలేక పోయారు. కృష్ణకి మాత్రం రమేష్ బాబుని పెద్దగా హీరోగా చూడాలని అనిపించడంతో ఆయన సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు రమేష్ బాబుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాసరి నారాయణరావు రూపొందించిన 'నీడ' అనే సినిమాతో రమేష్ బాబుని నటుడిగా పరిచయం చేశారు. అప్పటికి రమేష్ బాబు పదో తరగతి చదువుకుంటున్నారు.

'సామ్రాట్' అనే సినిమా

'సామ్రాట్' అనే సినిమా

ఇక అసలు నటన అంటే ఏంటో తెలిసేందుకు బాలనటుడిగాన్ కొన్ని సినిమాలు చేయించారు. ఆ తర్వాత రమేష్ యుక్తవయసులోకి వచ్చాక ఆయనకు నటనలో ట్రైనింగ్ ఇప్పించి గ్రాండ్ గా పరిచయం చేయాలనుకున్నారు. అలా ఆయన 'సామ్రాట్' అనే సినిమా ఓకే చేశారు. వి.మధుసూదనరావు ఆ సినిమాకు దర్శకుడు. అప్పట్లో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'బేతాబ్' అనే సినిమాకి ఇది రీమేక్.

టైటిల్ వివాదాస్పదమై

టైటిల్ వివాదాస్పదమై

ఇక తెలుగులో ఈ సినిమాకి 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టగా.. అప్పట్లో ఈ టైటిల్ వివాదాస్పదమైంది. ఎందుకంటే అప్పటికే హీరోగా ఎస్టాబ్లిష్ అయిన బాలకృష్ణ కూడా తన సినిమాకి 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టుకున్నారు. దీంతో కృష్ణ రంగంలోకి దిగి కోర్టుకు వెళ్లి టైటిల్ కోసం పోరాడారు. ఫైనల్ గా టైటిల్ కృష్ణకే చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడంతో బాలకృష్ణ తన సినిమాకి 'సాహస సామ్రాట్' అని పేరు మార్చుకోవాల్సి వచ్చింది.

హీరోగా మాత్రం

హీరోగా మాత్రం

అలా రమేష్ బాబు హీరోగా 'సామ్రాట్' 1987లో విడుదలైంది. సినిమా అంత బాగోకున్నా కలెక్షన్లు బానే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'బజార్ రౌడీ' అనే సినిమా రమేష్ బాబుకు భారీ విజయాన్ని తీసుకొచ్చింది. అతని కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. తన కెరీర్లో దాసరి నారాయణ రావు, వి మధుసూధనా రావు, జంధ్యాల, కె మురళి మోహన్ రావు, ఎస్ ఎస్ రవిచంద్ర లాంటి దర్శకులతో పని చేసినా.. హీరోగా మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయారు రమేష్ బాబు.

నిర్మాతగా

నిర్మాతగా

నటనలో గ్యాప్ రావడంతో 1997లో చివరిగా రమేష్ బాబు ఎం కౌంటర్ అనే సినిమాలో కనిపించరు. ఆ తర్వాత నిర్మాతగా కృష్ణ సొంత బ్యాన‌ర్ ప‌ద్మాల‌యా స్టూడియోస్‌లో చేసిన సూర్య‌వంశం హిందీ రీమేక్‌కు ర‌మేష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. మ‌హేష్ హీరోగా గుణ శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన అర్జున్ చిత్రాన్ని నిర్మించారు. అలాగే మ‌హేష్, సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందిన అతిథి సినిమాను కూడా రోనీ స్క్రూవాలాతో క‌లిసి నిర్మించారు. త‌ర్వాత మ‌హేష్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దూకుడు, ఆగ‌డు చిత్రాల‌కు ర‌మేష్ బాబు సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X