ప్రీమియర్ షోలతో గ్రాండ్‌గా విడుదలవుతున్న ‘ఆక్వామ్యాన్’
జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ కలిసి నటించిన చిత్రం అక్వామేన్ . డి.సి.కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగులో సముద్రపుత్రుడు పేరుతో ఎన్.వి.ఆర్.సినిమా బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు.
జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వంచరస్ చిత్రంలో జేసన్ మమోవా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ హాలీవుడ్ మూవీలో జేసన్ ఫ్రెండ్ మేర పాత్రలో అంబర్ హియర్డ్ కనిపించబోతున్నారు.

ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 14న ఈ చిత్రం ఇండియాలో విడుదలవుతుండగా ఒక రోజు ముందే దేశ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేయబోతున్నారు.
సినిమా గరించి ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ది కంజురింగ్, ది కంజురింగ్ 2, ప్యూరియస్ 7 వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు జేమ్స్ వాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాను అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. అమెరికా కంటే వారం ముందుగానే భారతదేశంలో సినిమా విడుదలవుతుంది. ఇలాంటి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్న సైజు బాహుబలిలా మెప్పిస్తుంది. సముద్రంలో సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి అన్నారు.


Click it and Unblock the Notifications











