రవితేజ ఈగిల్ మూవీపై మా సినిమాను రిలీజ్ చేస్తాం.. దిల్ రాజు మాతో మాట్లాడలేదు.. సందీప్ కిషన్ హాట్ కామెంట్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఊరు పేరు భైరవకోన. రాజేశ్ దండ నిర్మాతగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యువ హీరో సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్, అందిస్తుండగా, చోటా కే నాయుడు ఎడిటర్ బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్, నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ..

ఊరు పేరు భైరవకోన సినిమా మూడేళ్ల క్రితం మొదలుపెట్టాం. రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్నాం. గత సంవత్సరం ఎన్ని కష్టాలను చూడాలో అన్ని కష్టాలు చూశాం. మేము అనుకొన్నట్టు సినిమాను బయటకు తీసుకురావాలి. మా డైరెక్టర్ విజన్‌ను ఉన్నది ఉన్నట్టు చూపించాలి. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసా, వెచ్చించే సమయానికి తగిన గౌరవం ఇవ్వాలనే భయంతో ఈ మూవీ అవుట్‌పుట్‌ను మళ్లీ మళ్లీ చెక్ చేసుకొన్నాం అని సందీప్ కిషన్ చెప్పారు.

Sandeep Kishan Clarity of Ooru Peru Bhairavakona release date against Ravi Tejas Eagle

ఊరు పేరు భైరవకోన సినిమా ద్వారా గొప్పగా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని కష్టపడ్డాం. ఈ సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్‌ చాలా కష్టపడి పనిచేశారు. ఈ టీమ్‌కు పెద్ద విజయం అందుకోవడం చాలా అవసరం. దానిని బాధ్యతగా తీసుకొని ఈ సినిమాకు పనిచేశాం అని సందీప్ కిషన్ అన్నారు.

ప్రేమికులు చల్లగా ఉండాలనేది మా టీమ్ టార్గెట్. ఫిబ్రవరి 9వ తేదీన దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, హ్యుమర్, మంచి పాటలు, యాక్షన్ సీన్లతో ప్యాకేజ్‌తో రూపొందించారు. వీఐ ఆనంద్ సినిమాను ఊహించని విధంగా తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి అని సందీప్ కిషన్ రిక్వెస్ట్ చేశారు.

నిజాయితీగా చెప్పాలంటే.. ఊరు పేరు భైరవకోన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకొన్నాం. పండుగ సమయంలో భూతాలు, దెయ్యాలు, మ్యాజిక్ అంశాలు పిల్లల్ని విశేషంగా ఆకట్టుకొంటాయనే ఉద్దేశంతో సినిమాను రిలీజ్ చేయాలనుకొన్నాం. కానీ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని మేము మా రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకొన్నాం. ఆ తర్వాత టిల్లు స్వేర్ సినిమా వస్తుందని నిర్ధారించుకొన్న తర్వాత మా సినిమాను కూడా రిలీజ్ చేయాలని డేట్ ప్రకటించాం అని సందీప్ కిషన్ అన్నారు.

ఇక ఫిబ్రవరి 9వ తేదీన రవితేజ నటించిన ఈగిల్ సినిమా రిలీజ్ అవుతున్నది. డైరెక్టర్ వీఐ ఆనంద్‌కు రవితేజకు మంచి రిలేషన్ ఉంది. లాస్ట్ సినిమా ఆయనతోనే చేశాడు. అనిల్ సుంకరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరికి బిజినెస్ పార్ట్‌నర్ షిప్ ఉంది. కానీ ఈగిల్ సినిమా రిలీజ్ గురించి మాకు చెప్పలేదు. ఒకవేళ కాల్ చేస్తే మేము మాట్లాడుతాం అని సందీప్ కిషన్ చెప్పారు.

Sandeep Kishan Clarity of Ooru Peru Bhairavakona release date against Ravi Tejas Eagle

నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ.. నిర్మాతలు మాతో మాట్లాడలేదు. మరిచిపోయారనుకొంటాను. రెండేళ్లు చాలా కష్టపడ్డాం. వెనక్కిపోతే మాకు డేల్స్ లేవు. రిలీజ్ చాలా కష్టం అవుతుంది అని ఆయన అన్నారు. దాంతో ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రావడం గ్యారెంటీ అనేది తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X