VD12 వావ్.. విజయ్ దేవరకొండ లుక్ అదుర్స్.. వైల్డ్ డైరెక్టర్ క్రేజీ రియాక్షన్!
తెలుగు సినిమా దగ్గర హీరోలకి ఇపుడు ఏమాత్రం కొదవలేదు. బంచాఫ్ హీరోస్ ఇపుడు టాలీవుడ్ ని రూల్ చేస్తున్నారు. అటు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఇటు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా ఇండస్ట్రీ లోకి వచ్చి అదరగొడుతున్నారు. అయితే ఈ రెండిటికి మధ్యలో ఓ యంగ్ హీరో టాలీవుడ్ లో సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.. మరి ఆ యువ హీరోనే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.
ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మరి ఆ సినిమా ఏంటో కూడా అందరికీ తెలుసు. అదే "అర్జున్ రెడ్డి". మాస్ ఆడియెన్స్ లో మూవీ లవర్స్ లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించి ఒక్క దెబ్బతో తాను కూడా పాన్ ఇండియా దర్శకుడు అయిపోయాడు. మరి అగ్రేషన్ సినిమాల్లో ఇద్దరూ ఒక బ్రాండ్ ని సెట్ చేసేసుకోగా అక్కడ నుంచి మళ్ళీ కలిసి పని చేయలేదు.

వేరే వేరే సినిమాలు చేస్తూ ఎవరికి వారు బిజీగా మారిపోగా మళ్ళీ ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా పడితే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సమయం పట్టేలా ఉంది కానీ ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న లేటెస్ట్ సినిమా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయగా..
దానికి ఫ్యాన్స్ నుంచి సినీ ప్రముఖులు నుంచి మాస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దీనిపై తన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. మరి ఇందులో విజయ్ దేవరకొండ అసలు పెట్టి క్రేజీ రియాక్షన్ ని తాను అందించాడు. "ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువ అవుతుంది, లుక్ బాగా నచ్చేసింది దేవరకొండ విజయ్ సాయి" అంటూ విజయ్ పూర్తి పేరుతో సాలిడ్ రిప్లై తాను అందించాడు.

దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ లో సందీప్ పోస్ట్ మరింత ఉత్సుకత తీసుకొచ్చింది. దీనితో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి ఇది ఎప్పటికి నిజం అవుతుందో కానీ విజయ్ 12వ సినిమాకి మాత్రం ఒక ఊహించని లుక్ లో అదరగొట్టేసాడు అని చెప్పాలి.
కాగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ, త్రివిక్రమ్ బ్యానర్ లపై ఈ చిత్రం తెరకెక్కిస్తుండగా ఈ ఆగస్ట్ లోనే టైటిల్ ని రివీల్ చేస్తామని ఈరోజు పోస్టర్ తో తెలిపారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 28న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతానికి అయితే పాన్ ఇండియా రిలీజ్ అన్నట్టు ఎక్కడా కన్ఫర్మ్ చెయ్యలేదు.


Click it and Unblock the Notifications











