Prabhas: ఎన్టీఆర్ టెంపర్‌కు ప్రభాస్ స్పిరిట్‌కు కనెక్షన్.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరో.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో కలిసి స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ టెంపర్ కు కనెక్షన్ ఉండనుందని నెట్టింట్లో వైరల్ గా మారింది ఆ వివరాల్లోకి వెళితే...
ఈ ఏడాది ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆదిపురుష్ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సలార్ మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ.500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి.. సూపర్ హిట్ట్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ప్రభాస్.

మరోవైపు ఈ ఏడాది యానిమల్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా... ప్రభాస్ తో స్పిరిట్ అనే చిత్రం తెరకెక్కించనున్నాడు.
తాజాగా సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. 'యానిమల్' విజయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణయ్ 'స్పిరిట్' సినిమా గురించి చెప్పుకువచ్చాడు. ప్రణయ్ మాట్లాడుతూ... ''ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటి సారి పోలీస్ డ్రెస్ లో కనిపించనున్నారని వెల్లడించారు. సందీప్ రెడ్డి గత చిత్రాల్లో హీరోల క్యారెక్టర్ ఎలా ఉంటుందో 'స్పిరిట్'లో ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తాడని తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి హీరోకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పగలనని వెల్లడించారు. అలాగే సందీప్ వంగా-అల్లు అర్జున్‌ల కాంబో గురించి మాట్లాడుతూ.. ఇంకా దానికోసం కథ సిద్ధం కాలేదని చెప్పుకువచ్చారు. ప్రస్తుతం వారి చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు అయ్యాక బన్నీ ఇమేజ్‌కు సరిపోయే కథను రూపొందించనున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ స్పిరిట్ సినిమా క్యారెక్టర్.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు కనెక్షన్ ఉండబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. దానికి కారణం అందులో ఎన్టీఆర్ క్యారక్టర్ వైల్డ్ గా ఉంటుందని.. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ లో కూడా అంతే వైల్డ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చేసిన పోలీస్ పాత్రకు దగ్గర దగ్గర లింకులు ఉంటాయని సమాచారం. ఓ సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో ప్రభాస్ విలన్లతో కలిసిపోయి ఏం చేశాడన్నేదే ఈ సినిమా మెయిన్ లైన్ గా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల్లో సమాచారం.


Click it and Unblock the Notifications











