Sanjay Dutt: 4000 కోట్లతో సంజయ్ దత్ సరికొత్త చరిత్ర.. ప్రభాస్, రణ్‌వీర్‌‌ రికార్డులు గల్లంతు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. వారం తిరిగేసరికి 1000 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాహుబలి 2, పుష్ప 2, కల్కి సహా పలు భారీ చిత్రాల రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలుకొడుతూ 2000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది ధురంధర్ 2. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సంజయ్ దత్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ దిగ్గజాలు సునీల్ దత్, నర్గీస్ దత్‌ల కుమారుడే సంజయ్ దత్. 1981లో రాఖీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన విధాత, నామ్, కల్ నాయయక్ తదితర చిత్రాలతో హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనే వార్తల్లో నిలిచాడు సంజయ్ దత్. కొత్త కుర్రాళ్ల రాకతో తన ఇమేజ్‌కు తగినట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి ఎన్నో విజయాలు సాధించారు. విలన్‌గా, సహాయ నటుడిగా, అతిథి పాత్రలతో అభిమానులను మెప్పించారు.

Sanjay Dutt Creates History with 4 Rs 1000 Crore Films as Dhurandhar 2 Breaks Records

భారతీయ సినీనటుల్లో అత్యధిక సార్లు 1000 కోట్లు సాధించిన హీరోలు అంటే ప్రభాస్ (బాహుబలి 2, కల్కి), షారుఖ్ ఖాన్ (జవాన్, పఠాన్), రణ్‌వీర్ సింగ్ (ధురంధర్, ధురంధర్ 2) చిత్రాలతో వీరు ఈ ఘనత సాధించారు. అయితే ఈ సూపర్‌స్టార్ల రికార్డులను బద్ధలు కొట్టారు సంజయ్ దత్. గత కొన్నేళ్లుగా వరుసపెట్టి హిట్ చిత్రాల్లో భాగమవుతూ వస్తున్న ఆయన అరుదైన ఘనత సాధించారు. నాలుగు సార్లు 1000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో సంజయ్.

ప్రశాంత్ నీల్ - యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్‌తో సంజయ్ దత్ 1000 కోట్ల ప్రయాణం ప్రారంభమైంది. ఇందులో విలన్ అధీరగా అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 వరల్డ్ వైడ్‌గా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌లో ఎస్‌టీఎఫ్ ఆఫీసర్ మహాదేవన్ నాయక్‌గా గెస్ట్ రోల్‌లో కనిపించారు సంజయ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1160 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇక గతేడాది ఆదిత్యధర్- రణ్‌వీర్ సింగ్‌ల ధురంధర్‌లో సంజయ్ దత్ నటనను ఎవరూ మరిచిపోరు. ఎస్పీ చౌదరి అస్లామ్‌గా ఆయన పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. ధురంధర్ తొలి భాగం 1365 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు తాజాగా ధురంధర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రంతో నాలుగోసారి 1000 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించాడు సంజయ్. ఈ చిత్రం 11 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 1300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి 2000 కోట్ల మార్క్ వరకు అడుగులు వేస్తోంది. అలా భారతీయ సినీ చరిత్రలో 4 సార్లు 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాలో భాగమైన నటుడిగా సంజయ్ దత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Read more about: sanjay dutt prabhas ranveer singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X