twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరణం అంచుల వరకు వెళ్లొచ్చా.. లైఫ్ చిన్నాభిన్నం.. భయంతో వణికాను.. సంజయ్ దత్

    |

    బాలీవుడ్ హీరో సంజయ్ దత్ డగ్ర్స్‌కు బానిసై జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకొన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నుంచి ఎలా బయటపడ్డారనే విషయం తన జీవితం ఆధారంగా వచ్చిన సంజూ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. తాజాగా తన జీవితంలోని దారుణమైన క్షణాలను గుర్తుచేసుకొన్నారు. డ్రగ్ ఫ్రీ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉద్వేగం ఏమని ప్రసంగించారంటే..

    దారుణమైన సంఘటనలతో జీవితం

    దారుణమైన సంఘటనలతో జీవితం

    నా జీవితంలో జరిగిన విషయాలను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. దారుణమైన సంఘటనలను చెప్పడానికి చాలా ధైర్యాన్ని తెచ్చుకొన్నాను. డ్రగ్స్ వినియోగం వల్ల నా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. ఆ క్షణంలో మరణం తప్పదని అనుకొన్నాను. అలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ నుంచి విముక్తిడనయ్యాను అని సంజయ్ దత్ చెప్పారు.

    మలుపుతిప్పిన సంఘటన అదే

    మలుపుతిప్పిన సంఘటన అదే

    నా జీవితంలో ఓ రోజు జరిగిన దారుణమైన సంఘటన మలుపుతిప్పింది. ఉదయమే ఆకలితో నిద్రలేచాను. అప్పటికే అమ్మ మరణించిన విషాదంలో మునిగిపోయాను. ఆకలితో ఉండటంతో ఏదైనా ఆహారం తినడానికి ఇవ్వమని అడిగాను. దాంతో మీరు రెండు రోజుల నుంచి ఏమి తినకుండా నిద్రలోనే ఉన్నారని చెప్పడంతో షాక్ గురయ్యాను.

    అమెరికాలో చికిత్సతో

    అమెరికాలో చికిత్సతో

    అలాంటి పరిస్థితుల్లో బాత్రూమ్‌లోకి వెళ్లగానే ముక్కు, నోటి నుంచి రక్తం కారడం జరిగింది. అద్దంలో చూసుకొని భయంతో వణికిపోయాను. వెంటనే నాన్న వద్దకు వెళ్లి నాకు ఏదైనా చికిత్స చేయించమని వేడుకొన్నాను. దాంతో నాకు అమెరికాలో చికిత్స జరిపించారు. ఆ సమయంలో అనేక కష్టాలను అనుభవించాను అని సంజయ్ పేర్కొన్నారు.

    డ్రగ్స్‌ను అలా మానేశానని

    డ్రగ్స్‌ను అలా మానేశానని

    అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకొని ఇండియాకు వచ్చాను. ఆ తర్వాత చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవాలనే కోరిక కలిగింది. కానీ నా కోరికను ఎలాగోలా అణిచివేసుకొన్నాను. ఓ రోజు డగ్ర్స్ అమ్మే వ్యక్తి మళ్లీ కలిసి వాటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను అని సంజయ్ దత్ చెప్పారు. సంజూ చిత్రంలో ఇలాంటి సీన్లు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే విధంగా ఉన్న సంగతి తెలిసిందే.

    English summary
    Bollywood hero Sanjay Dutt recently attended an event to promote the campaign called "Drug Free India", and shared how he was almost on the verge of dying while he was on drugs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X