For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.. చూస్తే గుండె ఆగిపోతుంది.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

  |

  2005లో సోగ్గాడు అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది సంజనా గల్రాని. అయితే ఈ భామ పేరు తెచ్చుకుంది మాత్రం బుజ్జిగాడు అనే సినిమా ద్వారానే.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన ఈ భామ ఫేమస్ అయింది మాత్రం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాతే. తాజాగా ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  అలా ఎంట్రీ

  అలా ఎంట్రీ

  సోగ్గాడు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంజనా ఆ తర్వాత తమిళ సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే స్వతహాగా కన్నడ రాష్ట్రానికి చెందిన ఈ భామ దాదాపు ఐదారు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ భామకు కాస్త గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన బుజ్జిగాడు అనే సినిమానే.

  ఎన్ని సినిమాలు చేసినా నో యూజ్

  ఎన్ని సినిమాలు చేసినా నో యూజ్

  ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో సత్యమేవ జయతే అనే సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ తరువాత సమర్థుడు, పోలీస్ పోలీస్, దసరా, ముగ్గురు, యమహో యమ, నేనేం చిన్నపిల్లనా, జగన్ నిర్దోషి, ఐ లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, అవును2, 2 కంట్రీస్ అనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించిన ఈ భామకు ఆ సినిమాతో కూడా క్రేజ్ దక్కలేదు.

  అన్నీ వివాదాలే

  అన్నీ వివాదాలే

  అయితే గత ఏడాది ఆమె డ్రగ్స్ అమ్ముతున్నట్లు అలాగే సెక్స్ రాకెట్ కు సంబంధించిన కొన్ని ఆరోపణలు ఎదుర్కొని ఈ భామ జైలుపాలైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్యనే జైలు నుండి విడుదలైన ఈ భామ పెళ్లి కూడా వివాదాస్పద అంశంగా మారింది. ఆమె పెళ్లి చేసుకున్నది ఒక ముస్లిం వ్యక్తిని కావడంతో దాని మీద కూడా అనేక వివాదాలు చెలరేగాయి. తాజాగా ఈ భామ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

  పవన్ ను చూస్తే గుండె ఆగిపోతుంది

  పవన్ ను చూస్తే గుండె ఆగిపోతుంది

  తెలుగు సినిమా హీరోలలో తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని తాను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.. ఆయనను చూడగానే గుండె ఒక్కసారి కొట్టుకోవడం ఆగిపోతుందని ఆమె వెల్లడించింది. హిందీ సినిమాల్లో షారుక్ ఖాన్ అంటే ఇష్టం అని, తన తండ్రి తరువాత తాను మరో మగవాడిని ప్రేమించాను అంటే అది షారుక్ ఖాన్ అని చెప్పింది. ఇక పవన్ తో కలిసి పని చేసిన తర్వాత ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం బాగా పెరిగిపోయాయని ఆడవాళ్లకు ఆయన గౌరవం ఇచ్చే పద్ధతి చూస్తే తాను ఇంకా ఇంప్రెస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

  ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
  చిరంజీవికి అవసరం లేదు

  చిరంజీవికి అవసరం లేదు

  ఇక చిరంజీవి చేస్తున్న సేవలను గురించి పొగిడిన ఆమె తాను కూడా తన సంజన ఫౌండేషన్ ద్వారా 27 రోజుల పాటు రోజుకు 1000 మందికి ఆహారం పంపిణీ చేశానని అది చాలా కష్టతరమైన పనే అని చెప్పుకొచ్చింది. అలాంటిది చిరంజీవి ఒక పక్కన బ్లడ్ బ్యాంకు నడుపుతూనే మరోపక్క జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని, చేయాల్సిన అవసరం లేకపోయినా చిరంజీవి తనను ఇంతవాడిని చేసిన వారికోసం సేవ చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

  English summary
  Actress Sanjjanaa Galrani made interesting comments on pawan kalyan. actress says that Pawan Kalyan makes her heart skip a beat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X