పవన్ రొమాంటిక్ పర్సన్...మొదటి భార్య నా బంధువే.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో, టాలీవుడ్ లో పాపులర్ కావాలంటే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే చాలు అనేట్టు ఉంది పరిస్థిత. ఈ విషయం అర్థం చేసుకుని చాలా మంది పవన్ కళ్యాణ్ ను విమర్శించి ఫేమస్ అయ్యారు. కత్తి మహేష్ మొదలుకొని మొన్నటి శ్రీ రెడ్డి దాకా అందరూ పవన్ ను ఆయన పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ విమర్శించిన వారే.

ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో మరో దర్శకుడు చేరాడు.. ఎప్పుడో తెలుగులో కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించిన ఆయన ప్రస్తుతానికి ఒక ఫిలిం స్కూల్ ఓపెన్ చేసుకుని దాని మీద కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి ఆయనను తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో పవన్ కళ్యాణ్ మీద అక్కసు వెళ్లగక్కారు. ఇంతకీ ఎవరా దర్శకుడు ఆయన ఏమన్నారో చూస్తే!

సంకీర్తనతో దర్శకుడిగా మారి

సంకీర్తనతో దర్శకుడిగా మారి

నాగార్జున హీరోగా వచ్చిన సంకీర్తన అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు గీతాకృష్ణ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఒక్కటి కూడా సరిగా ఆడలేదు. తెలుగులో కోకిల, కీచురాళ్ళు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీ బార్ లాంటి సినిమాలు తెరకెక్కించిన ఆయనకు మొదటి సినిమా కి లభించినంత ప్రశంసలు మరే సినిమాకు లభించలేదు. మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్న ఆయన తర్వాత జనాన్ని మెప్పించడంలో విఫలమయ్యాడు. తమిళంలో కూడా రెండు సినిమాలు చేశాడు ఆయన. అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

వకీల్ సాబ్ గురించి అడిగితే

వకీల్ సాబ్ గురించి అడిగితే

అయితే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన కారణంగా పలు యూట్యూబ్ ఛానల్స్ ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒక యూట్యూబ్ ఛానల్ గీతాకృష్ణను ఇంటర్వ్యూ చేసింది. సదరు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా గురించి సదరు యాంకర్ ప్రశ్నించగా దానికి స్పందిస్తూ గీతాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్ రొమాంటిక్, నాకు అలాగే ఉండాలనుంది

పవన్ రొమాంటిక్, నాకు అలాగే ఉండాలనుంది

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చూశారా ? ఎలా ఉంది ? అంటూ యాంకర్ ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం గురించి ఆయన పొలిటికల్ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు గీతాకృష్ణ. ముందుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ప్రస్తావించిన ఆయన తనకు పవన్ మొదటి భార్య గాయత్రీ బంధువు అవుతుందని చెప్పుకొచ్చారు.

అలాగే రేణు దేశాయ్ ని ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకువచ్చింది కూడా నేనేనని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రొమాంటిక్ పర్సన్ అని చెప్పుకొచ్చిన ఆయన పవన్ భార్యలకు మాత్రం ఎలాంటి లోటు చేయలేదని, వాళ్ల అందరికీ వంద శాతం న్యాయం చేశాడు అని చెప్పుకొచ్చాడు. తనకు కూడా పవన్ లా బతకాలని ఉంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

అసలు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు

అసలు ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు

అయితే ఆయన చేసిన కామెంట్స్ గురించి పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన మీద రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయిందని, అసలు మీరు ఎవరో కూడా తమకు తెలియదని అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఈజీగా మీడియాలో అటెన్షన్ దొరుకుతుందనే కారణంగా ఆయన ఇలా కామెంట్స్ చేశాడు అని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఛానళ్లు ఇంటర్వ్యూలకు పిలవడానికి బదులు ఆదర్శ రైతులనో, సంఘ సేవ చేస్తున్న వారినో ఇంటర్వ్యూ చేస్తే సమాజానికి కాస్తయినా మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X