అర్జున్ రెడ్డి మూవీ నటితో.... విశాల్ వివాహం, అనీషా రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ హాట్ టాపిక్!
Recommended Video

తమిళ స్టార్ విశాల్ పెళ్లి గురించి కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తెలుగు కుటుంబానికి చెందిన ఈ హీరో త్వరలో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ కూతురును పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలకు కారణం విశాల్ తండ్రి జికె రెడ్డి ఇటీవల ఓ చిన్న హింట్ ఇవ్వడమే. ఆ వెంటనే విశాల్ ఫియాన్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ విశాల్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇపుడు ఆ అమ్మాయే విశాల్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి అతడితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడించడం గమనార్హం.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడించిన అనిషా రెడ్డి
ఆళ్ల అనీషా రెడ్డి అనే అమ్మాయి తను విశాల్‌ను పెళ్లాడబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సంక్రాంతి పండగ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో విశాల్ పెళ్లిపై అయోమయం తొలగినట్లయింది.

సినిమాల్లో నటించిన అనీషా రెడ్డి
హైదరాబాద్‌లో బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అనీషా రెడ్డి ఇంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి' చిత్రాల్లో చిన్న పాత్ర పోషించింది.

విశాల్‌తో సెటిలవ్వడంపై సంతోషం
అనిషా రెడ్డి నటిగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రంగంలో ఆమె సెటివ్వాలనుకోవడం లేదని స్పష్టమవుతోంది. త్వరలో విశాల్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతుండటంపై చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టు చూస్తే స్పష్టమవుతోంది.

చూడముచ్చటైన జంట
విశాల్ పొడవుకు పర్ఫెక్టుగా సూటయ్యేలా అనీషా రెడ్డి తగిన జోడీలా ఉందని, చూడముచ్చటైన జంట అంటూ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంవత్సరమే వీరి పెళ్లి జరుగుతుందని విశాల్ తండ్రి జిరె రెడ్డి తెలిపారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











