సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్న ఆదిపురుష్.. మళ్ళీ రిలీజ్ ఇప్పుడంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇక 2023 సంక్రాంతి కానుకగా రాబోయే పెద్ద సినిమాలపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ఫెస్టివల్ కు తప్పకుండా నాలుగు అతిపెద్ద సినిమాలు వస్తాయి అని ముందు నుంచి ఒక టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇక అన్ని సినిమాలు కంటే ముందుగానే ఆదిపురుష్ సంక్రాంతికి రాబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఆ డేట్ కు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ 107వ సినిమా అలాగే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య దిల్ రాజు వారసుడు సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా రకాల కథనాలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ నుంచి ఒక సినిమా అయితే తప్పుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపించింది. అయితే మొదట నందమూరి బాలకృష్ణ సినిమా లేదా చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండిటిలో ఏదో ఒకటి ఈ పోటీలో నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అని ముఖ్యంగా మెగాస్టార్ సినిమాని వాయిదా పడవచ్చు అని కూడా అన్నారు.

Sankranti box office fight Prabhas adipurush movie postponed plans viral

కానీ ఇప్పుడు ఊహించని విధంగా ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పోటీగా ఉండే అవకాశం లేదు అని మరొక టాక్ మొదలైంది. ఆదిపురుష్ కు సంబంధించిన రూమర్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. సంక్రాంతికి ఒక వారం ముందు లేదా సంక్రాంతి తర్వాత జనవరి 26ని టార్గెట్ చేస్తూ ఆ సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉండవచ్చట. అంటే సంక్రాంతికి దాదాపు రెండు వారాల తర్వాత గాని రావచ్చని కూడా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయితే జనవరి దాటిపోయే అవకాశం లేదు అని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X