ఎనర్జిటిక్ డైరెక్టర్‌తో బాలకృష్ణ మూవీ: కాంబినేషన్ సెట్ చేసిన బడా ప్రొడ్యూసర్

పేరుకు సీనియర్ హీరోనే అయినా.. కుర్రాళ్లతో పోటీగా సినిమాలు చేస్తుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అందుకే టాలీవుడ్‌లో ఆయనంత వేగంగా ఎవరూ సినిమాలు చేయలేరు అన్న టాక్ కూడా ఉంది. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన... ఈ ఏడాది లాక్‌డౌన్ వల్ల ఒక్క సినిమాను కూడా అందించలేకపోయారు. అనివార్య పరిస్థితుల్లో వచ్చిన ఈ గ్యాప్‌ను వచ్చే సంవత్సరం కవర్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం బోయపాటి శ్రీను మూవీ పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేస్తున్నారు.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను తర్వాత నందమూరి బాలక‌ృష్ణ.. ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నారట. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా బాలయ్య విన్నారని, వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా పొలిటికల్ టచ్ ఉన్న కథతో రూపొందనుందని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడనుందని అంటున్నారు.

 Santosh Srinivas to Direct Nandamuri Balakrishna Under Anil Sunkara Production

ఇదిలా ఉండగా, సంతోష్ శ్రీనివాస్ కెరీర్ ఆరంభంలో 'ఖతర్నాక్', 'టక్కరి', 'రెయిన్‌బో' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఈ క్రమంలోనే రామ్ హీరోగా 'కందిరీగ' అనే సినిమాను తెరకెక్కించి డైరెక్టర్‌గా సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన 'రభస' మాత్రం నిరాశ పరిచింది. అనంతరం రామ్‌తో చేసిన 'హైపర్' పర్వాలేదనిపించింది. ప్రస్తుతం సంతోష్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య సినిమాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని వినికిడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X