హీరోగా సెట్స్‌కు రావొద్దు, కమెడియన్‌గా అయితేనే ఒప్పుకొంటాం.. సప్తగిరికి దర్శకుడు ఝలక్!
Recommended Video
హీరోగా జోష్ కొనసాగిస్తున్న కమెడియన్ సప్తగిరి నటించిన తాజా చిత్రం వజ్ర కవచధార గోవింద. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాతలుగా అరుణ్ పవర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు బుల్గానియన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సప్తగిరి సరసన హీరోయిన్‌గా వైభవి జోషి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంటున్న ఈచిత్రం మే నెలలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సప్తగిరి మాట్లాడుతూ..

మొదటి రెండు చిత్రాలకు
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత నేను చేస్తున్న చిత్రం వజ్ర కవచధార గోవిందా. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలు చేసేటప్పుడు నేను భయపడలేదు. ఎందుకంటే ఆ రెండు చిత్రాలు రీమేక్స్. అందువల్ల వాటిపై నాకు అవగాహన, నేనే చేసే పాత్రపై పూర్తిగా క్లారిటీగా ఉండేది. ఆ రెండు సినిమాలు హిట్ కావడంతో మంచి పేరు వచ్చింది. దాంతో నాకు ఓ ఫ్లాట్‌ఫాం ఏర్పడింది.

నేను నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి
ఇప్పుడు నేను చేస్తున్న వజ్ర కవచధార గోవింద చిత్రం స్ట్రయిట్ మూవీ. ఏదైనా నేను కొత్తగా నన్ను ఆవిష్కరించుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్న సినిమా ఇది. జీటీఆర్ మహేంద్ర కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. హీరోకు ఉన్న లక్ష్యం గొప్పది. అయితే హీరో వెళ్లాల్సిన మార్గం కూడా మంచిదై ఉండాలి. లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే పాయింట్ ఆధారంగా సినిమా రూపొందింది. దేవుడు, మానవుడు అనే రెండు అంశాల మధ్య డివైన్ పాయింట్‌తో సినిమా చేశాం.

హీరోగా సెట్స్‌కు రావొద్దు
మహేంద్ర, డైరెక్టర్ అరుణ్ పవార్, స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్రకాశ్ ముగ్గురు కలిసి కథను బాగా రాశారు. సినిమా ఓకే చేసిన వెంటనే ఈ ముగ్గురు నాకు ఓ సలహా ఇచ్చారు. సినిమా సెట్‌కు మీరు హీరోగా వస్తే చేయలేం. కమెడియన్‌గా వస్తే సినిమాను బ్రహ్మండంగా రూపొందించవచ్చని చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు స్కోప్ ఉన్న సినిమా అయినందు వల్ల కమెడియన్‌గానే కనిపించాను. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని సప్తగిరి అన్నారు.

నవ్విస్తాను.. ఎమోషన్‌కు గురిచేస్తాను
వజ్ర కవచధార గోవింద సినిమాలో కామెడీ సీన్లతోపాటు ఎమోషనల్ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. సప్తగిరి ఈ సినిమాలో నవ్విస్తాడు. ఎమోషన్‌కు గురిచేస్తాడు. వజ్ర కవచధార స్ట్రయిట్ సినిమా. మీరంత తప్పక ఆదరించాలి. తెలుగులో తొలిసారి చైనీస్ పాటను ఈ సినిమాలో పెడుతున్నాం. చైనా సినిమా యూనిట్ సంప్రదించి ఆ పాటను తెలుగులో పాడించాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











