మే 17న సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవింద విడుదల

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మళ్లీ గోవింద నామస్మరణతో కమెడియన్ హీరో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవిందా చిత్రం మే 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్ డేట్ ప్రకటన, లిరికల్ వీడియో సాంగ్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో సప్తగిరి, నిర్మాతలు నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి, దర్శకుడు అరుణ్ పవార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ.. నా తొలిసినిమాలో కానిస్టేబుల్ కథ చెప్పాం. రెండో సినిమాలో రైతులు గురించి చెప్పాం. ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పబోతున్నాం. ప్రతీ మండలానికి ఓ క్యాన్సర్ హాస్పిటల్ కడితేనే గానీ ఆ వ్యాధిగ్రస్తులను బతికించుకోలేని పరిస్థితి ఉంది. వజ్రకవచధర గోవింద సినిమాతో వినోదంతోపాటు సామాజిక సందేశాన్ని అందజేస్తున్నాం అని చెప్పారు.

Saptagiris Vajra Kavachadhara Govinda release on May 17th

నిర్మాత బ్రహ్మయ్య మాట్లాడుతూ.. వజ్రకవచధర గోవింద పెద్ద హిట్ అవుతుంది. ఏపీ మొత్తం సొంతంగా రిలీజ్ చేయబోతున్నాను. ఈ సినిమా మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

నిర్మాత జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ.. వజ్రకవచధర గోవింద సినిమా బ్రహ్మండంగా వచ్చింది. కొత్త నిర్మాతలను మీరు ఆదరించాలి. మరిన్నీ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఏప్రిల్ 27న సాయంత్రం వజ్రకవచధర గోవింద లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X