For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    హీరో సప్తగిరిని వెంటాడిన క్రేజీ సెంటిమెంట్.. ఉగాది రోజున VKG రిలీజ్

    |

    ఇటీవల కాలంలో టాలీవుడ్‌ను కొత్త సెంటిమెంట్ తగలుకొన్నది. ఆంగ్ల అక్షరాలతో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించడంతో నిర్మాతలు, దర్శకుల చూపు ఇంగ్లీష్ అక్షరాలపై పడింది. Arjun Reddy, RX100, F2 చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ సప్తగిరి నటించిన సినిమాకు VKG ' (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌ ) అనే టైటిల్‌ను ఖరారు చేయడం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితె

    ఉగాది బరిలో సప్తగిరి

    ఉగాది బరిలో సప్తగిరి

    సప్తగిరి నటిస్తున్న' VKG ' (`వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌` ) షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరోసారి విభిన్నమైన పాత్రలో సప్తగిరి కనిపించే ఈ చిత్రానికి అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు . శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇటీవల మైసూరు, తదితర ప్రాంతాల్లో ఆఖరి షెడ్యూల్ చిత్రీకరించారు.

    దొంగగా విభిన్న పాత్రలో సప్తగిరి

    దొంగగా విభిన్న పాత్రలో సప్తగిరి

    ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ ''హీరో స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, అలాంటి అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. స్టోరి డిమాండ్ మేరకే ప‌వ‌ర్‌ఫుల్‌గా ' VKG ' (`వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌` ) అనే టైటిల్‌ పెట్టాం. ఫ‌న్నీ దొంగ‌కు, `వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌`కు టైటిల్‌కు సంబంధమేమిటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.

    అన్నివర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్

    అన్నివర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్

    'VKG' (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌) టైటిల్ పెట్టగానే మాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మా విశ్వాసాన్ని మరింత పెంచింది. కథ, కథనాల్లో ఉండే పవర్‌కు తగినట్టుగానే మా నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను ఆకర్షణీయంగా రూపొందించే బాధ్యతను మాపై ఉంచారు'' అని అన్నారు.

     అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా

    అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా

    నిర్మాత‌లు నరేంద్ర యెడల , జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ``మా హీరో స‌ప్త‌గిరితో మా ద‌ర్శ‌కుడు అరుణ్‌ప‌వార్‌ తెర‌కెక్కించిన `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్` సినిమా ఎంతటి సక్సెస్‌ను సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి ఏమాత్రం త‌గ్గ‌కుండా మా ' VKG ' (`వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌` ) ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. హైదరాబాద్ , మైసూర్, మెల్కోటే , కూర్గ్ పరిసర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాల్లో `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` చిత్రాన్ని తెర‌కెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం '' అని తెలిపారు .

     నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు, సాంకేతికవర్గం

    నటీనటులు: వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు
    కథ: జి టి ఆర్ మహేంద్ర,
    సంగీతం: విజయ్ బుల్గానిన్,
    కెమెరా: ప్రవీణ్ వనమాలి,
    ఎడిటింగ్: కిషోర్ మద్దాలి,
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు,
    స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.

    English summary
    Saptagiri's VKG set release on April 6th. Vajrakavachadhara Govinda movie directed by Arun Pawar. Music by Vijay Bulganin. Produced by Narendra Yendala, GVN Reddy.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more