twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్కార్ తెలుగులో హిట్ కావాలంటే.. మురుగదాస్‌పైనే భారం!

    |

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదలకు సిద్ధం అవుతోంది. కత్తి, తుపాకీ, మెర్సల్, తేరి వంటి వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో ఇప్పటికే కత్తి, తుపాకీ వంటి చిత్రాలు వచ్చాయి. దీనితో సర్కార్ పై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

    తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రానికి 120 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలుగు వర్షన్ హక్కులకు కూడా మంచి ధరే పలికినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్ర హక్కులు 7 కోట్లకు అమ్ముడయ్యాడట. తమిళంలో విజయ్ సూపర్ స్టారే. కానీ తెలుగులో అతడికి మార్కెట్ లేదనేది వాస్తవం.

    Sarkar movie telugu version rights sold for good price

    సినిమాకు మంచి టాక్ వస్తే 7 కోట్లు రికవరీ చేయడం కష్టం కాకపోవచ్చు. మురుగదాస్ కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అతడి చిత్రాలని తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. మురుగదాస్ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి తోడైంది కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

    English summary
    Sarkar movie telugu version rights sold for good price. Movie ready to release on November 6
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X