సర్కార్ విలన్ మాట.. విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు!
తమిళనాట ఎక్కడ చూసిన సర్కార్ జపమే కనిపిస్తోంది. తెలుగులో కూడా సర్కార్ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సర్కార్ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పై మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాతో మురుగదాస్, విజయ్ మరోమారు మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో స్వతహాగా రాజకీయ నాయకుడైన పాల కురుపయ్య నటించారు. పల కురుపయ్య రాధా రవి, వరలక్ష్మి శరత్ కుమార్ ని నెగిటివ్ రోల్స్ కోసం ఎంచుకున్న మురుగదాస్ ప్రయత్నం ఫలించింది.
ఇదిలా ఉండగా పాల కురుపయ్య ఓ ఇంటర్వ్యూ లో విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్కార్ చిత్రం ద్వారా విజయ్ ని చాలా దగ్గరగా గమనించానని ఆయన అన్నారు. ఇద్దరం పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాం. విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ఆయన అన్నారు. విజయ్ నాలుగు పదుల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు.

తనపై ఇంత ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్న ప్రజల కోసం ఎదో ఒకటి చేయాలనీ విజయ్ నాతో అన్నారు. ఇప్పటికి ఇప్పుడు అన్ని వదిలేసి అతడు రాజకీయాల్లోకి వస్తాడని నేను చెప్పను. కానీ విజయ్ ఎదో ఒకరోజు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయం అని కురుపయ్య అన్నారు. కురుపయ్య స్వతహాగా రాజకీయ నాయకుడు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.


Click it and Unblock the Notifications











