For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata Birthday Blaster: మహేశ్ బాబు అరుదైన రికార్డ్.. ఇందులో మూడు అందులో ఐదో స్థానం

  |

  సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా చిన్న వయసులోనే తన యాక్టింగ్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసి.. 'రాజకుమారుడు' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు మహేశ్ బాబు. మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకున్న అతడు.. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎన్నో ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

  హిట్లకు పొంగిపోకుండా.. ఫ్లాపులకు క్రుంగిపోకుండా ఉండే మహేశ్.. ఫ్యాన్స్‌ను సంతృప్తి పరిచే చిత్రాలను చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  సూపర్ డూపర్ ఫామ్‌లో మహేశ్ బాబు

  సూపర్ డూపర్ ఫామ్‌లో మహేశ్ బాబు

  కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ మధ్య కాలంలో బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు.

  ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస హిట్లను అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అతడి ఖాతాలో విజయాల హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  ‘సర్కారి వారి పాట' పాడుతోన్న మహేశ్

  ‘సర్కారి వారి పాట' పాడుతోన్న మహేశ్

  వరుస హిట్లను అందుకుంటూ దూసుకుపోతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే.

  కథ ఇదేనంటూ.. అప్పటి మహేశ్ బాబు

  కథ ఇదేనంటూ.. అప్పటి మహేశ్ బాబు

  మహేశ్ బాబు చేస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు.

  అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఈ సినిమా అన్ని హంగులతో కలిసి ఉంటుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో వింటేజ్ మహేశ్ బాబును చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  వరుసగా ఆటంకాలు.. షూటింగ్ అప్‌డేట్

  వరుసగా ఆటంకాలు.. షూటింగ్ అప్‌డేట్

  'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ వెంటనే పరశురాంతో 'సర్కారు వారి పాట' చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడు కరోనా ప్రభావంతో ఇది వెంటనే ప్రారంభం కాలేదు. ఇక, ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. మళ్లీ గ్యాప్ వచ్చి ఇటీవలే రెండో మొదలైంది. ఇక, ఇటీవలే మూడో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లింది. ఇది కూడా రెండు రోజుల క్రితమే ముగిసింది. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తైనట్లు తెలుస్తోంది.

  పుట్టినరోజు కానుకగా టీజర్.. రికార్డులు

  పుట్టినరోజు కానుకగా టీజర్.. రికార్డులు


  ఆగస్టు 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 46వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి పుట్టినరోజు కానుకగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డును నెలకొల్పింది.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  మహేశ్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్


  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్‌లో మహేశ్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అలాగే, అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్‌ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వీటితో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది. దీంతో ఈ టీజర్‌కు ఇప్పటికీ అదిరిపోయే స్పందన వస్తోంది. ఫలితంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియో తాజాగా ఒక మిలియన్ లైకులను అందుకుంది. తద్వారా మహేశ్ ఖాతాలో మరో రికార్డు చేరింది.

  Recommended Video

  Real Secret Behind Sudheer Babu Six Pack
  ఇందులో మూడు అందులో ఐదో స్థానం

  ఇందులో మూడు అందులో ఐదో స్థానం


  'సర్కారు వారి పాట' టీజర్ తాజాగా ఒక మిలియన్ లైకులను అందుకోవడంతో.. టాలీవుడ్‌లో ఇది మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ ఎక్కువ లైకులు సాధించిన చిత్రాల జాబితాలో 'పుష్ప' 1.88 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత 'రామరాజు ఫర్ భీమ్' వీడియో 1.45 మిలియన్ లైకులతో రెండో స్థానంలో ఉంది. ఇక, వ్యూస్ పరంగా చూస్తే.. మహేశ్ బాబు టీజర్ ఐదో స్థానానికి చేరుకుంది. దీని కంటే ముందు 'పుష్ప', 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీం', 'అఖండ' మూవీ టీజర్లు ఉన్నాయి.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now This Movie Teaser Sarkaru Vaari Paata Birthday Blaster Reach 1 Million Likes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X