Sarkaru Vaari Paata Birthday Blaster: మహేశ్ బాబు ఖాతాలో మరో రికార్డు
దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సుదీర్ఘ కాలంగా హీరోగా చేస్తున్నా.. ఈ మధ్యనే అతడు సూపర్ డూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీనికి కారణం ఈ స్టార్ హీరో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవడమే. హిట్టు మీద హిట్టు హిట్టు మీద హిట్టు కొడుతూ ఇప్పటికీ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు మహేశ్.
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తైంది. మిగిలిన దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలని మహేశ్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా హైదరాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఆగస్టు 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన 46వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి పుట్టినరోజు కానుకగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. ఇందులో మహేశ్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించారు. అలాగే, అతడు చెప్పిన డైలాగ్స్, చూపించిన గ్రేస్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. వీటితో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సూపర్బ్‌గా ఉంది. వీటికి తోడు ఈ లుక్‌తో వింటేజ్ మహేశ్ బాబును గుర్తు చేశాడు చిత్ర దర్శకుడు పరశురాం.
'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియోకు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక, తాజాగా ఈ వీడియో 30 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. దీంతో తెలుగులో వేగంగా ఈ మైలురాయిని అందుకున్న టీజర్ల జాబితాలో చేరిపోయింది. ఫలితంగా మహేశ్ బాబు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ భారీ చిత్రంలో ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











