మహేశ్ బాబు ఖాతాలో మరో ఘనత: టాలీవుడ్‌లో నాలుగో స్థానం.. కానీ బాలయ్య కంటే వెనకాలే
కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. ఆ వెంటనే వంశీ పైడిపల్లితో 'మహర్షి', ఆ తర్వాత అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు చేసి వరుస హిట్లను అందుకున్నాడు. ఈ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అతడి ఖాతాలో విజయాల హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా రూపొందుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గత జనవరిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు అరవై శాతం షూట్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఇక, ఇప్పుడు ఫారెన్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9న తన 46వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' నుంచి పుట్టినరోజు కానుకగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా అప్పుడు రికార్డును నెలకొల్పింది. ఇక, ఇటీవలే ఒక మిలియన్ లైకుల మైలురాయిని కూడా చేరుకుంది.
'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' వీడియో ఇప్పటికే మంచి రెస్పాన్స్‌నే అందుకుంటోంది. ఫలితంగా తాజాగా యూట్యూబ్‌లో ఈ టీజర్ వీడియో 40 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న టీజర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకుంది. తెలుగులో ఎక్కువ మంది వీక్షించిన టీజర్ల లిస్టులో 87 మిలియన్ వ్యూస్‌తో 'పుష్ప' మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 63 మిలియన్ వ్యూస్‌తో 'రాధే శ్యామ్' రెండో స్థానంలో, 57 మిలియన్ వ్యూస్‌తో 'అఖండ' మూడో స్థానంలో ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ అందుకుంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. అయితే, ఇప్పుడా డేట్ మారిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











