మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. ఎంతో కష్టంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీని ద్వారా తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. దీంతో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు నమోదైంది. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా జరిగింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఘనంగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటాషా దలాల్ వివాహం (ఫొటోలు)

హ్యాట్రిక్‌తో ఫుల్ జోష్ మీదున్న మహేశ్

హ్యాట్రిక్‌తో ఫుల్ జోష్ మీదున్న మహేశ్


కొన్నేళ్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆ మధ్య భారీ పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్న అతడు.. ఇటీవలి కాలంలో అతడు వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడు ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సర్కారు వారి పాటతో సత్తా చాటేందుకు

సర్కారు వారి పాటతో సత్తా చాటేందుకు

పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

షూటింగ్ అప్‌డేట్... దుబాయ్‌లో ప్రిన్స్

షూటింగ్ అప్‌డేట్... దుబాయ్‌లో ప్రిన్స్

బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తీసే చిత్రమే 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్ బాబు, హీరోయిన్ కీర్తీ సురేష్ దుబాయ్ వెళ్లారు. అక్కడ సోమవారం నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

‘సర్కారు’కు భారీ ఆఫర్... మొదటిసారి

‘సర్కారు’కు భారీ ఆఫర్... మొదటిసారి

వరుస విజయాలను అందుకుంటోన్న మహేశ్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో అతడి సినిమాలు వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. దీంతో 'సర్కారు వారి పాట' నైజాం రైట్స్‌కు డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ హక్కుల కోసం ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించేందుకు పలువురు రెడీ ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

మహేశ్ పేరిట ప్రపంచ రికార్డు నమోదు

మహేశ్ పేరిట ప్రపంచ రికార్డు నమోదు

'సర్కారు వారి పాట' సినిమా జనవరి 25 అంటే నేటి నుంచే షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్‌లో భాగంగా దుబాయ్‌లో హీరో, హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించారు. దీంతో ఏకంగా ప్రపంచ రికార్డే నమోదు అయింది.

Recommended Video

Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!

చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!

కొద్ది రోజులుగా మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్ #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ట్యాగ్ ఏకంగా వంద మిలియన్లకు పైగా ట్వీట్లను అందుకుంది. ఇలా గతంలో ఏ పరిశ్రమకు చెందిన సినిమా కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. దీంతో విడుదలకు ముందే 'సర్కారు వారి పాట' ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X